ఆస్కార్ అవార్డు పొంది మన సినిమా సంగీతానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకు వచ్చిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్ ఏమి చేసినా సంచలనమే. ప్రముఖ తమిళ దర్శకుడు వసంత బాలన్‌ దర్శకత్వం వహిస్తున్న 'కావ్య తలైవన్‌' చిత్రానికి రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నాడు. సిద్ధార్థ్‌, పృధ్వీ తదితరనటులు నటిస్తున్న ఈ సినిమా రంగస్థల కళాకారుల జీవితనేపథ్యంలో రుపొందుతోంది. ఎంతో వైవిధ్యభరితంగా రూపొందుతున్న ఈ సినిమా కోసం ఎ ఆర్‌ రెహ్మాన్‌ 22 పాటలకు సంగీతం సమకూర్చాడు. అయితే ఆ 22 పాటల్లో ఒక పాట ఆడియో విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది.  హింసకు వ్యతిరేకంగా రూపొందించిన ఈ సినిమాలోని ఒక  పాటను రెహ్మాన్‌ ఇటీవల వెబ్ మీడియాలో విడుదల చేస్తే ఈ పాటకు ఒకే ఒక్క రోజులో 50 వేల లైకులు వచ్చాయి అని తెలుస్తోంది. 'ఉలగమే యుద్ధం ఎదర్కు ఓ ఉయిర్‌గలే రత్తం ఎదర్కు’ అనే పల్లవితో సాగే ఈ పాటకు భావం (“ప్రపంచమా యుద్ధం ఎందుకు.. ప్రాణమా రక్తం ఎందుకు”). ప్రస్తుతం ఈపాట ఇంటర్నెట్‌లో విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఇరాక్ లాంటి పలుదేసాలతో పాటు అనేక దేశాలలో యుద్ధ వాతావరణం చోటు చేసుకుని అనేక మంది అమాయకులు బలి అవుతున్న నేటి వర్తమాన పరిస్థుతులను ఈపాట ప్రతిబింబిస్తోంది. కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్న ఈసినిమా ఆడియో ఈనెల 31న చెన్నైలో విడుదల కాబోతోందని సమాచారం. రెహమాన్ సంగీత విశ్వరూపానికి ఈ సినిమా పాటలు ప్రతిబింబంగా నిలుస్తాయి అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: