బాలీవుడ్ ప్రేక్షకులు ‘కిక్‌’లో అంత కిక్‌ లేదంటూ తేల్చేసినా సల్మాన్ ఇమేజ్ కిక్ సినిమాకు నాలుగు రోజులలో100 కోట్లు వసూలు చేయడం బాలీవుడ్ సినిమా రంగం లో సంచలనం గా మారింది . సల్మాన్ క్రేజ్ తో పాటు రంజాన్‌ సీజన్‌లో ఈ సినిమా సినిమా విడుదల కావడం కలిసి వచ్చింది అని అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు. బాలీవుడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమా ఫస్ట్ డే 26.50 కోట్లు, సెకండ్ డే 27.15, థర్డ్ డే 30.18 కోట్లు కలెక్ట్ చేసి నాలుగో రోజుకే 100 కోట్ల మార్క్ కు చేరిన 4వబాలీవుడ్ మూవీగా రికార్డ్స్‌కు ఎక్కంది అని వార్తలు వస్తున్నాయి .  టాలీవుడ్ హిట్ మూవీ రవితేజ ‘కిక్’కు రీమేక్ గా దీనిని బాలీవుడ్ లో రీమేక్ చేసినా తెలుగు వెర్షన్ లోని బ్రహ్మానందo పాత్రను పూర్తిగా తీసివేసి కామెడీ డోస్ తగ్గించడం కుడా ఈ సినిమాకు డివైడ్ టాక్ రావడానికి ఒక కారణం అని అంటున్నారు . సాజిద్ నడియాడ్ వాలా దర్శకనిర్మాణం‌లో తెరకెక్కించిన ఈ సినిమాలో జాక్విలెన్ ఫెర్నాండెజ్ తెలుగు వెర్షన్ లోని ఇలియానా పాత్రను పోషించినా ఇలియానా స్థాయిలో నటించలేదు అనే టాక్ కుడా ఉంది.  సల్మాన్ హీరోయిజం, నవాజుద్దేన్ విలన్ రోల్స్‌కి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం తో ఈ సినిమా సల్మాన్ అభిమానులకు ఎంతో కొంత నచ్చినా సాధారణ ప్రేక్షకులను అలరించ లేకపోతోoదని వార్తలు వస్తున్నాయి . ఇంత నెగటివ్ టాక్ లో కుడా ఈ సినిమా కేవలం నాలుగు రోజులలో 100 కోట్ల మార్క్ చేరుకోవడం సల్మాన్ క్రేజ్ ను మరోసారి చాటింది అనుకోవాలి . 

మరింత సమాచారం తెలుసుకోండి: