బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా ట్రైలర్ కు వచ్చిన అనూహ్య స్పందన వల్ల వచ్చిన ఆనందం కొన్ని రోజుల్లోనే మటుమాయం అయిపోయింది. దీనికి కారణం హృతిక్ నుంచి విడాకులు కోరుతున్న అతడి భార్య సుజానె తనకు హృతిక్ విడాకుల సందర్భంగ 400 కోట్లు భరణంగా కావాలని కోర్టును అభ్యర్ధిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఈ ఏడాది ఏప్రిల్ లో పరస్పర అంగీకారంతో హృతిక్, సుజానేలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తుది తీర్పు అక్టోబర్ 31 తేదిన వెలువడనుంది అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హృతిక్ దంపతులకు  పుట్టిన పిల్లలు  హ్రిహాన్, హ్రేదాన్ లను సుజానేలకు అప్పగించారు అనే వార్తలు కూడ వినపడుతున్నాయి. 13 ఏళ్ల పాటు బాలీవుడ్ లో అన్యోన్య దాంపత్యానికి చిరునామాగా నిలిచిన ఈ జంట ఆ తరువాత వచ్చిన భేదాభిప్రాయాలు వల్ల విడిపోతున్నారు. ఈ నేపధ్యంలో హృతిక్ భార్య సుజానె 400 కోట్లు డిమాండ్ చేస్తోంది అనే వార్తలు జాతీయ మీడియాలో రావడం అటు హృతిక్ ను ఇటు సుజానె ను బాదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాము విడిపోతున్నది నిజం అయినా ఈ డైవర్స్ వెనుక ఎటువంటి ఆర్ధిక వ్యవహారాలు లేవని ఇది కేవలం తమను అవమాన పరచడానికి మీడియా రాస్తున్న వార్తలు అంటూ ఈ ఇరువురు ఈ వార్తలను ఖండిస్తున్నారు.  అయితే మీడియా మాత్రం సుజానె రోషన్ రూ. 400 కోట్లు భరణం కింద డిమాండ్ చేస్తున్నట్లు తమ వార్తల హడావిడి కొనసాగిస్తూనే ఉంది . ఈ వార్తలే నిజం అయితే భరణం విషయం లో కుడా హృతిక్ రికార్డులు సృష్టిస్తున్నట్లే అనుకోవాలి . 

మరింత సమాచారం తెలుసుకోండి: