యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్ట్రీలో పలు రకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ గాసిప్స్ అన్నీ యంగ్ టైగర్ వ్యక్తిగత లైఫ్ కి సంబంధించినవి కాదు. తను నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ రభస మూవీపై పలు రకాల గాసిప్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో హడలెత్తున్న ప్రొడ్యూజర్ ఏకంగా మీడియాకి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్టీఆర్ నటించిన రభస మూవీ ఆగష్టు 15న విడుదలకి సిద్ధం అవుతుంది. అలాగే ఆగష్టు 1న ఘనంగా ఆడియో వేడుకని జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే గత వారం రోజులుగా రభస మూవీ విడుదల వాయిదా పడింది. ఫైనాన్షియల్ ఇబ్బందులు అందుకు కారణంగా నిలుస్తున్నాయి అంటూ తెగ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని ఈ న్యూస్ ని అభిమానులతో సహా అందరూ నమ్మేస్తున్నారు. అయితే నిజానికి ఈ మూవీ వాయిదా పడలేదు. ఈ గాసిప్స్ నిర్మాత వద్దకు వెల్లడంతో నిర్మాత బెల్లంకొండ సురేష్ రభస మూవీ విడుదలపై మరోసారి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చుకున్నాడు. ఎన్టీఆర్ నటించిన 'రభస' చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత మళ్లీ ప్రకటించారు. ఈ మూవీకి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. డైరెక్టర్ వ్యక్తిగత కారణాల కారణంగా మూవీ షూటింగ్ రెండు నెలల పాటు ఆలస్యంగా షూటింగ్ జరుపుకున్నదని అంటున్నారు. మొత్తంగా అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్న రభస మూవీ ఆగష్టు 15న రిలీజ్ అని తెలియటంతో వారు ఇప్పటి నుండే ఎదురుచూస్తున్నారు. రభస మూవీలో సమంత, ప్రణీత లు హీరోయిన్స్ గా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: