అత్యంత వివాద దర్శకుడు, ప్రతిభావంతుడు, అయిన వర్మ త్వరలోనే ఓ ఫిల్మ్ స్కూల్ ని ఓపెన్ చేసే పనిలో బిజిగా ఉన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన టాపిక్ టాలీవుడ్ పిల్మ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. వర్మ గత కొంత కాలం నుండి చెప్పుకోదగ్గ మూవీలను తీయలేకపోతున్నాడు. ఒకప్పటి వర్మ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ సక్సెస్ లని ఇస్తే, ఇప్పటి వర్మ కేవలం నిర్మాతలని సేఫ్ జోన్ లో పడేసే మూవీలని మాత్రమే తెరకెక్కించగలుగుతున్నాడు. అయితే అందుకు ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన మార్పులే తనని ఇలా చేయిస్తున్నాయని చెప్పుకొచ్చాడు. టాలీవుడ్,బాలీవుడ్,కోలీవుడ్ ఇలా పలు ఫిల్మ్ ఇండస్ట్రీలలో వర్మ దగ్గర శిష్యరికం చేశామని, వర్మ స్కూల్ నుండి వచ్చాం అని ఎంతో మంది యువ దర్శకులు తరుచూ చెప్పుకోవడం . జరుగుతుంది. అయితే తాజాగా వర్మ అప్ కమింగ్ డైరెక్టర్స్ కి ఓ మెసేజ్ ఇచ్చాడు. అలా తను మెసేజ్ ఇచ్ఛిన తరవాత రోజు వర్మ ఓ డెసిషన్ తీసుకున్నాడు. ప్రస్తుత పరిస్థితిల్లో రొటీన్ కి భిన్నంగా ఉండే ఓ ఫిల్మ్ స్కూల్ కంపల్సరీ అని భావించాడంటా. తన పెడుతున్న ఫిల్మ్ స్కూల్ సినీ నిర్మాణంతో కొత్త పుంతలను తీసుకువస్తుందని భావిస్తున్నాడు. అందుకు తను ఎంచుకున్న ప్రదేశం విజయవాడ. విజయవాడలో వర్మ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ ని రన్ చేయబోతున్నాడు. ఈ విషయం తెలియగానే యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చూపు ఒక్క సారిగా వర్మ స్కూల్ వైపు పడింది. మరో బ్రాంచ్ ముంబాయ్ లో కూడ ఉంటుంది. అయితే హెడ్ ఆఫీస్ గా మాత్రం విజయవాడని తీసుకుంటున్నట్టుగా వర్మ సన్నిహితుల నుండి అందిన సమాచారం. వర్మ ఏది చేసినా కొంత వైరీటీగా ఉంటుంది. వర్మ పెడుతున్న ఫిల్మ్ స్కూల్ తను ఉన్నంత కాలం ఉంటుంది అని అనుకుంటే పొరపాటే. తను ఈ స్కూల్ ని కేవలం అయిదు సంవత్సరాలే నడుపుతాడంట. ఈ లోపే నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ వచ్చి నేర్చుకోవాలి. ఆ తరువాత ఫిల్మ్ స్కూల్ ని మూసేస్తానని చెబుతున్నాడు. దీంతో వర్మ ఫిల్మ్ స్కూల్ లో ఎంత మంది జాయిన్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: