ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డం వచ్చిందంటే వారు ఏం చేసినా అది సన్సేషన్ అవుతుంది. మొదట ఆఫర్స్ కోసం నిర్మాతలు, డైరెక్టర్స్ చుట్టు తిరిగిన వాళ్ళు, స్టార్ డం వచ్చిన తరువాత వాళ్ళనే వీరి చుట్టు తిప్పించుకుంటారు. ప్రస్తుతం బిటౌన్ పిల్మ్ ఇండస్ట్రీలో సరిగ్గా ఇటువంటిదే ఒక హీరోయిన్ విషయంలో జరుగుతుంది. ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్, ప్రొడ్యూజర్స్ చుట్టు తిరిగిన దీపికా పదుకొనె, ఇప్పడు మాత్రం తన చుట్టే హీరోలు, దర్శకులు, నిర్మాతలని తిప్పించుకుంటుంది. ఇదిలా ఉంటే దీపికా పదుకొనె తాజాగా ఓ హాట్ ఫోటోషూట్ చేయించుకుంది. పేరుకి తను చేయించుకున్న మాటే కాని, ఓ కార్పోరేట్ సంస్థ, వారి కంపెనీ పబ్లిసిటీ కోసం దీపికాకి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి హాట్ ఫోటో షూట్ చేయించారు. తాజాగా దీపికా పదుకొనె యాక్ట్ చేసిన హాట్ ఫోటోషూట్ లో తన అందాలను తెగ ఆరబోసింది. ఒక మూవీకి రెండు కోట్ల నుండి అయిదు కోట్ల రూపాయల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్న దీపికా పదుకొనె, 40 సెకన్ల పాటు ఉంటే ఈ ఫోటో షూట్ కోసం దాదాపు 57 లక్షల రూపాయలను తీసుకుందట. ప్రస్తుతం నెట్ లో దీపికా పదుకొనె హాట్ ఫోటో షూట్ హల్ చల్ చేస్తుంది. ఇందులో దీపికా పదుకొనె పూర్తి బ్లాక్ వైట్ డ్రెస్ తో బికిని లుక్ లో దర్శనమిచ్చింది. ఎటువంటి కలర్ డ్రెస్ లని వాడకుండా కేవలం బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ తోనే తన అందాలను ఎక్స్ పోజ్ చేసిన విధానం, మతి పోగొడుతుంది. మొత్తానికి దీపికా పదుకొనె తన హాట్ ఫోటో షూట్ తో బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ హీరోయిన్స్ చేత ఇలా హాట్ ఫోటో షూట్ చేయించుకొని, వారి బ్రాండ్స్ ప్రమోట్ చేసుకోవటం అనేది ఇప్పుడు చాలా సాధరమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: