నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబును నియమిస్తారు అన్న వార్తలు వినపడి అవి మళ్ళీ యూటర్న్ తీసుకుని మహేష్ స్థానంలో పవన్ పేరును ప్రస్తావిస్తూ వార్తలు రావడం పవన్ కు కొద్దిగా ఇబ్బందిగా మారింది అంటూ వార్తలు వస్తున్నాయి. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ సానియామిర్జాను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ ఇటువంటి పదవి ఏర్పాటు చేయబోతోంది అన్న వార్తల నేపధ్యంలో ఫిలింనగర్ లో పెద్ద చర్చ ఇప్పిటికే ప్రారంభం అయింది. పవన్ ప్రచారాన్ని గత ఎన్నికలలో తనకు అనుకూలంగా మలుచుకున్న చంద్రబాబు ఈ బ్రాండ్ అంబాసిడర్ గౌరవానికి మహేష్ కన్నా పవన్ అన్నివిధాల అర్హుడు అన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులో చంద్రబాబుకు ఉన్న రాజకీయ అవసరాల రీత్యా చంద్రబాబు ఈ ఎత్తుగడ వేస్తున్నాడు అని టాక్. అయితే పవన్ ను ఎలా ఈ పదవి విషయంలో ఒప్పించాలి అన్న టెన్షన్ బాబుకు కూడ ఉంది అని అంటున్నారు. అయితే అతి త్వరలో తన ‘జనసేన’ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అటు తెలంగాణాలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో తన ‘జనసేన’ పార్టీని బలోపేతం చేద్దాము అని ఆలోచన చేస్తున్న పవన్ కు వస్తున్న ఈ వార్తలు తనకు అసౌకర్యం కలిగించడమే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ పదవిని అంగీకరిస్తే తన రాజకీయ భవిష్యత్ కు ఆటంకం గా మారుతుందని ఇప్పటికే పవన్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: