రాజశేఖర్ కు చిరంజీవికి మధ్య సంబంధ బాందవ్యాలు సరిగాలేవు అన్న విషయం ఈ నాటిది కాదు. ఎప్పటి నుంచో ఈ వార్తలు వింటూనే ఉన్నాం. సినిమాలలో అవకాశాలు లేకపోవడంతో రాజశేఖర్ రాజకీయాలలో చిరంజీవిలా ఎదుగుదామని ప్రయత్నించినా అక్కడ కూడా రాజశేఖర్ కు ఎదురు దెబ్బలే తగిలాయి. ఈ నేపధ్యంలో ఈ మధ్య రాజశేఖర్ ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన కోరిక సంచలనంగా మారింది. ప్రస్తుతం సీనియర్ హీరోలు అంతా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్న నేపధ్యంలో మీరు కూడ మల్టీ స్టారర్ సినిమాలు చేస్తారా? అని ఆ ఇంటర్వ్యూ నిర్వహించిన యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాజశేఖర్ తనకు కూడ మల్టీ స్టారర్ సినిమాలలో నటించాలని ఉంది అంటూ ఒక విచిత్ర కోరిక మనసులోనిది బయట పెట్టాడు. రాజశేఖర్ కు చిరంజీవితో కలిసి నటించాలని ఉందట. అయితే ఆ మాటలు విన్నవారితో పాటు యాంకర్ కూడ కొద్దిగా షాక్ అయ్యాడు అని న్యూస్. ఇప్పటికే రాజశేఖర్ చిరంజీవిల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తున్న నేపధ్యంలో రాజశేఖర్ ఈ కోరికను సెటైర్ గా వేసాడా? లేదంటే సీరియస్ గా అన్నాడా అన్నది రాజశేఖర్ కే తెలియాలి. త్వరలో చిరంజీవి 150వ సినిమా రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు కాబట్టి రాజశేఖర్ కోరికను చిరంజీవి, చరణ్ లు తీరుస్తారేమో చూద్దాం.   

మరింత సమాచారం తెలుసుకోండి: