రజినీకాంత్ ను సూపర్ స్టార్ గా మార్చిన రజినీ సిగరెట్ స్టైల్ ఆయన నటించిన సినిమాలకు ఎంతో పెరుతెప్పించి కాసుల వర్షం కురిపించింది. తమిళనాడులో ఇప్పటికీ ఎంతో మంది యూత్ రజినీ సిగరెట్ స్టైల్ ను ఫాలో అవుతూ ఉంటారు. అటువంటి క్రేజ్ ను తెచ్చిపెట్టిన రజనీ అలవాటును కాపీ కొడదామని ప్రయత్నించి రజినీ అల్లుడు ధనుష్ చిక్కుల్లో పడ్డాడు. ధనుష్ లేటెస్ట్ సినిమా ‘విఐపి’ కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పోస్టర్ల పై తమిళనాడులో తీవ్ర వివాదాలు రాజుకుంటున్నాయి. దీనికి కారణం ఈ సినిమా పోస్టర్లలో ధనుష్ సిగరెట్ తాగుతూ కనిపిస్తూ ఉండటాన్ని చాలామంది తప్పు పడుతున్నారు. దీనిపై ఆందోళనలు కూడ జరుగుతున్నాయి.  ఈ పోస్టర్లను నిషేదించాలని కొంతమంది ఉద్యమం కూడ చేపట్టారు. ఈ పోస్టర్లను చూసేవారికి సిగరెట్ తాగడాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉన్నాయని కొంతమంది సామాజిక కార్యకర్తల ఆందోళన. అయితే ఈ పోస్టర్లలో ఎటువంటి పొరపాటు లేదని ఈసినిమాలోని ధనుష్ పాత్రను దృష్టిలో పెట్టుకుని ఈ పోస్టర్లను డిజైన్ చేసామని ఈ సినిమా యూనిట్ చెపుతోంది. అయితే ఈ పోస్టర్లను నిషేధించాలి అంటూ కొన్ని సామాజిక సంస్థలు అప్పుడే కోర్టు మెట్లు ఎక్కాయి అనే వార్తలు కూడ వస్తున్నాయి. మావగారికి క్రేజ్ తెచ్చిన సిగరెట్ అల్లుడికి అదే సిగరెట్ సమస్యగా మారింది అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: