భారతదేశపు జాతీయ జెండాను అవమానించిన దాంట్లో సెక్స్ బాంక్ మల్లికాశెరావత్ కి ఇబ్బందులు తప్పటం లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన టాపిక్స్ హాట్ హాట్ గా ఉన్నాయి. అందాలని ఆరబోసే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ మల్లికా షెరావత్ ఈ వివాదంలో ఇరుక్కుంటుంది. బాలీవుడ్ లో సెక్స్ బాండ్ మల్లిఖా శెరావత్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ డర్టీ పాటిలిక్స్ లో జాతియ జెండాపై కొన్ని సీన్స్ ని షూట్ చేసారు. అయితే అందులో మల్లిఖా శెరావత్ జాతీయ జెండాని అవమాన పరిచేలా కొన్ని సీన్స్ ఉన్నాయి. దీంతో ఈ బ్యూటీపై హైదరాబాద్ కి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త టి. ధనగోపాలరావు ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తను తాజాగా నటించిన “డర్టీ పాలిటిక్స్” అనే సినిమాలో మల్లిక జాతీయ పతాకాన్ని ఒంటికి చుట్టుకుని అవమానించింది అన్నది ఆయన అభియోగం. అందుకని మల్లికపై కటిన చర్యలు తీసుకోవాలి అని ఆయన కోర్టుని కోరారు. కోర్టు కూడ ధనగోపాలరావు వేసిన అభియోగాన్ని స్వీకరించింది. అంతే కాకుండా ఈకేసును త్వరగా పూర్తి చేసుకుందుకు చర్యలు జరుగుతున్నాయి. టి.ధనగోపాలరావు వేసిన కేసుకు పాజటివ్ గా తీర్పు వస్తే మూవీలో ఆ సీన్స్ ని పూర్తిగా తొలగించటమే కాకుండా, మల్లిఖా శెరావత్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ఆ చిత్ర నిర్మాత కస్తూర్ చంద్ బొకాడియా సైతం జాతీయ జెండాను అవమానపరిచేలా ఉన్న వాల్ పోస్టర్‌లను విడుదల చేశాడు. ఈ విషయాన్ని కూడ ధనగోపాలరావు పిటిషనర్ లో పేర్కొన్నారు. మొత్తానికి దీనికి సంబంధించిన కేసు వచ్చే వారం తేలనుంది. ఇలా ఈ మూవీపై చాలా రాష్ట్రాల నుండి ఈ విధమైన కేసులు నమోదయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సెక్స్ మల్లిఖా శెరావత్ ఈ ఒక్క మూవీలోనే నటిస్తుంది. తరువాత రెండు మూవీలు ఉన్నప్పటికీ అవి చెప్పుకోదగ్గవి కావని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: