టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ చిత్రాల నిర్మాతలలో ప్రధమంగా గుర్తుకువచ్చే నిర్మాత బెల్లంకొంత సురేష్. అయితే తన తనయుడు శ్రీనివాస్ మూవీని బెల్లంకొండ సురేష్ గ్రాండ్ గా రిలీజ్ చేశాడు. మూవీని హై క్వాలీటీలో తెరకెక్కించి, ఇతర ఆర్టిస్ట్ లకి రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఇచ్చి, క్వాలిటీ అవుపుట్ ని తెచ్చుకోగలిగాడు. అల్లుడు శీను మూవీ మొదటి వీక్ దాదాపు పది కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఓ డెబ్యూ హీరోకి టాలీవుడ్ లో ఇంతగా కలెక్షన్స్ వచ్చాయంటే అది గొప్పే అని చెప్పవచ్చు. పెద్ద పెద్ద బడాహీరోల తనయుల డెబ్యూ మూవీలకే ఈ రేంజ్ కలెక్షన్స్ రాలేదు. టాలీవుడ్ ట్రేడ్స్ లెక్కల ప్రకారం అల్లుడు శీను మూవీ ఓవరాల్ గా దాదాపు 20 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే నిర్మాతకి దీని వల్ల ఎటువంటి లాస్ లేదనుకుంటే పొరపాటే. అల్లుడు శీను మూవీపై నిర్మాత దాదాపు నలభై కోట్ల రూపాయల వరకూ ఇన్వెస్ట్ చేసినట్టు సమాచారం. ఈ విధంగా లెక్క చూసుకుంటే అల్లుడు శీను మూవీపై దాదాపు 20 కోట్ల వరకూ నష్టపోవాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే సురేష్ ఇంతటితో వదలకుండా కొడుకుతో మరో మూవీకి సిద్ధమవుతున్నాడంట. బెల్లంకొండ శ్రీనివాస్ తో తనే సెకండ్ మూవీను కూడ నిర్మిస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. కొడుకు ఫిల్మ్ కెరీర్ బేస్ మంచిగా ఉండాలని తండ్రిగా సురేష్ ఈ విధంగా చేయటం మంచిదే అని కొందరు అంటున్నారు. అయితే మొదటి మూవీకే 20 కోట్ల రూపాయల నష్టపోవాల్సి వస్తున్న నిర్మాత, రెండో మూవీకి కూడ దాదాపు మరో 20 కోట్ల రూపాయలను నష్టపోవాల్సి వస్తుందని టాలీవుడ్ లో లెక్కలు చెబుతున్నాయి. ఎంతైనా కొడుకు పై ఉన్న ప్రేమతో సురేష్ ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడటం లేదంట.

మరింత సమాచారం తెలుసుకోండి: