పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గోపాల గోపాల మూవీకి సంబంధించిన షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. మల్టీస్టారర్ మూవీగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతున్న చిత్రం గోపాల గోపాల. వెంకటేష్, పవన్ కళ్యాణ్ లు తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపిచంనున్నారు. అంతే కాకుండా వెంకటేష్, పవన్ కళ్యాణ్ మధ్య సంభాషణలు సైతం చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయని టాలీవుడ్ లోటాక్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గోపాల గోపాల మూవీ తరువాత నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ గబ్బర్ సింగ్2. గబ్బర్ సింగ్2 మూవీకి సంబంధించిన షూటింగ్ ఆగష్టు రెండవ వారం నుండి సెట్స్ మీద వెళ్ళనుంది. గోపాల గోపాల మూవీను 22 రోజులలో పూర్తి చేసినట్టుగానే, గబ్బర్ సింగ్ 2 మూవీను సైతం రెండు నెలల్లో పూర్తి చేయటానికి పవన్ కళ్యాణ్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాడు. దీంతో మరో రెండు నెలల పాటు తన కాల్షీట్స్ ని గబ్బర్ సింగ్2 మూవీకే పరిమితం చేశాడు. షూటింగ్ పూర్తైయ్యేంత వరకూ పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ ఏ విధమైన కార్యక్రమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇదిలా ఉంటే గబ్బర్ సింగ్2 కాస్టింగ్ లో అనూహ్యంగా ఓ వ్యక్తి తెరైకి వచ్చాడు. ప్రకాష్ రాజ్ గబ్బర్ సింగ్2 లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడనే న్యూస్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తుంది. మొన్నటి వరకూ ప్రకాష్ రాజ్ ని పట్టించుకోని గబ్బర్ సింగ్2 చిత్ర యూనిట్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ప్రకాష్ రాజ్ కి ఇందులో అవకాశాన్ని ఖన్ ఫర్మ్ చేసినట్టుగా చిత్ర యూనిట్ నుండి టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా ప్రకాష్ రాజ్ కి టాలీవుడ్ లో మళ్ళీ అవకాశాలు పుంజుకుంటున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కోలీవుడ్, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలోనే ఎక్కువుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. గత కొంత కాలంగా టాలీవుడ్ కి చెందిన ప్రముఖ ప్రొడ్యూజర్స్, హీరోలతో ప్రకాష్ రాజ్ వివాదాలలో చిక్కుకోవడంతో తను టాలీవుడ్ నుండి వరుస ఆఫర్స్ ని చేజిక్కించుకోలేకపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: