కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం జయలలిత, రజనీకాంత్ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే టాక్ ఓపెన్ గా వినిపిస్తుంది. చెన్నైలో ఎప్పుడూ రెండు పార్టీల మధ్య వార్ నడుస్తూ ఉంటుంది. ఒకటి జయలలిత పార్టీ, మరొకటి కరుణానిధి పార్టీ. వీరిద్దరి మధ్య జరుగుతున్న వార్ లో ఎవరు ఇన్వాల్వ్ అయిన వారి భరతం పడతారు వీరు. అందుకే జయలలితకి కోపం వచ్చే పనులు ఎవ్వరూ చేయరు. అమ్మ కోపానికి గురికాద్దని, ఒక వేళ అలాంటిది ఏమైనా జరిగితే నష్టాన్ని భారీగా అనుభవించాల్సి ఉంటుందని చెబుతుంటారు. విశ్వరూపం మూవీ రిలీజ్ సమయంలో కమల్ హాసన్ స్వయంగా ప్రత్యక్ష నరకం అనుభవించాడు. ఇదిలా ఉంటే తాజాగా రజనీకాంత్ అల్లుడు ధనుష్, ఓ అటవీ ప్రాంతంలో కట్టుకుంటున్న ఇంటిని జయలలిత ప్రభుత్వం కూల్చివేసింది. బేసిగ్గా ధనుష్ కడుతున్న ఆ ఇంటికి పర్మిషన్ లేకపోవడంతో ఆ ఇంటిని ఎటువంటి ఇంటిమేషన్స్ ఇవ్వకుండా కూల్చివేశారు. అయితే ఇదంత ధనుష్ పుట్టినరోజు వేడుకల సమయంలోనే జరిగిపోయింది. ఇదిలా ఉంటే ఈ విషయంలో రజనీకాంత్ కూడ సీరియస్ గానే ఉన్నాడంటూ తెలుస్తుంది. ఆ ఇల్లు ధనుష్ ది అని అందరికి తెలిసినా, కనీస ఇంటిమేషన్ అయినా లేకుండా, చట్ట పరమైన ప్రొసీజర్ ఫాలో కాకుండానే ఇంటిని కూల్చేయడం దారుణం అని అంటున్నాడట. ఆ ఇంటికి సంబంధించిన పర్మిషన్ ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. ఆ విషయాన్ని తెలుసుకోకుండా కూల్చేయడం రజనీని కలవరపరిచింది. అయితే సాక్షాలు చేతికి వచ్చేంత వరకూ కామ్ గా ఉండమని, అప్పటి వరకూ ఎక్కడా ఈ టాపిక్ గురించి మాట్లాడవద్దని అల్లడు ధనుష్ కి రజనీకాంత్ సీరియస్ గా క్లాస్ పీకి మరీ చెప్పాడని తెలుస్తుంది మొత్తంగా ఈ వ్యవహారం ఎక్కడ వరకూ వెళుతుందో అంటూ రజనీకాంత్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: