పవర్ స్టార్ పనన్ నటించబోతున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ గబ్బర్ సింగ్2. ఈ మూవీకి సంబంధించిన పనులు ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. దాదాపు సంవత్సరన్నర రోజులుగా ఈ మూవీకి సంబంధించిన పనులు జరుగుతూనే వస్తున్నాయి. నిర్మాత చేతిలో మనీ రెడీగా ఉన్నప్పటికీ హీరో వ్యక్తిగత కారణాలతో మూవీ ఇప్పటి వరకూ షూటింగ్ కి నోచుకోలేదు. అలాగే దర్శకుడు, ఇతర కాస్టింగ్ వంటి విభాగాలు కూడ గబ్బర్ సింగ్2 మూవీ కోసం సంవత్సర కాలం నుండి వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మూవీ కోసం టెక్నీషన్స్ బాగా నష్టపోతున్నారనే చెప్పాలి. గబ్బర్ సింగ్2 మూవీ షూటింగ్ అనేది కేవలం అయిదు నెలల్లో పూర్తయిపోయే ప్రాసెస్. హీరోకి సంబంధించిన సీన్స్ ని రెండు నెలల్లో పూర్తి చేస్తారు. ఇతర యాక్టర్స్ తో ఉన్న సీన్స్ ని నలభై రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గోపాల గోపాల మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దాదాపు ఈ షూటింగ్ పూర్తికావొచ్చింది. అయితే ఈ లోపు గబ్బర్ సింగ్2 మూవీలో పవన్ కళ్యాణ్ ని మినహాయించి ఇతర సీన్స్ ని షూట్ చేసుకోవచ్చు చిత్ర యూనిట్. కాని పవన్ కళ్యాణ్ కోసమే టైం వేస్ట్ చేయండం అనేది అర్ధం లేనిది అంటూ టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తుంది. ఆగష్టు2వ వారంలో గబ్బర్ సింగ్2 మూవీ స్టార్ట్ అవుతుందనేది ఇప్పటి వరకూ ఉన్న సమాచారం. అయితే అప్పటికీ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్2 షూటింగ్ లో పాల్గొంటాడా? లేదో? ఎవ్వరికీ తెలియదంట. కొంత మంది అయితే గబ్బర్ సింగ్2 ప్రాజెక్ట్ అనేది పేరుకు మాత్రమే. అది ఏనాడో అటకెక్కిపోయింది. దాని గురించి ఆలోచించటం వేస్ట్ అని అంటున్నారు. సరిగ్గా ఇటువంటి మాటలకు సమధానం చెప్పటానకే గతంలో గబ్బర్ సింగ్2 మూవీని లాంచనంగా ఓపెన్ చేశారు. ఇప్పడు ఈ వార్తలని ఖండించడం కోసం కనీసం ఓ స్టేట్ మెంట్ అయినా ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: