టాలీవుడ్ టాప్ హీరో సుర్యాకు ఎప్పటి నుంచో టాలీవుడ్ లో కూడ ఒక టాప్ హీరోగా వెలుగొందాలని కోరిక. ఆ కోరికతోనే ‘మనం’ లాంటి సూపర్ హిట్ సినిమాకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెలుగు తమిళ భాషలలో ఒకేసారి ఒక భారీ సినిమాను తాను నటిస్తూ నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా సూర్య నటించిన భారీ సినిమా ’అంజాన్’. తెలుగులో సికిందర్ గా వచ్చే నెల ఆగష్టు 15నున విడుదల కాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రభస’ కూడ అదేరోజు విడుదల అవుతూ ఉండటంతో ఈ రెండు సినిమాల మధ్య జరుగుతున్న పోటీ ఆశక్తి దాయకంగా మారింది. సూర్య నటిస్తున్న ‘సికిందర్’ కు భారీ అంచనాలు పెరిగి పోతు ఉండటంతో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కూడ చాల ఘనంగా నిర్వహిస్తున్నారు. ‘సికిందర్’ ఆడియోని రేపు హైదరాబాదులోని శిల్ప కళావేదిక ఆడిటోరియంలో ఘనంగా ఆవిష్కరిస్తున్నారు. ఈ ఆడియో వేడుకకు విలక్షణ నటుడు హీరో కమల్ హాసన్ గెస్ట్ గా వస్తున్నాడు. అదేవిధంగా ఈ ఫంక్షన్ కు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా అతిధిగా వస్తూ ఉండటంతో నాగార్జున హీరో సుర్యాను టాలీవుడ్ లో ప్రమోట్ చేస్తున్నాడు అంటూ నాగ్ పై సెటైర్లు పడుతున్నాయి.  జూనియర్ స్టామినా ముందు సూర్య స్టామినా ఎంత వరకు నిలుస్తుందో వచ్చేనెల ఆగష్టు 15నున తెలియనున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: