రామ్‌చరణ్‌ హీరోగా కృష్ణవంశీ తీస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ లో విలన్ గా ఆదర్శ్ బాలకృష్ణ చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో హ్యాపీ డైస్, రైడ్, వినాయకుడు, అప్పలరాజు వంటి సినిమాలలో విలన్ గా చేసినా ఆదర్శకు బ్రేక్ రాలేదు. అయితే కృష్ణవంశీ తాను తీస్తున్న ‘గోవిందుడు’ సినిమా కోసం ఈ యంగ్ విలన్ ను ఏరికోరి ఎంచుకోవడమే కాకుండా ఇతడి విలనిజాన్ని డిఫరెంట్ గా ‘గోవిందుడు’ సినిమాలో కృష్ణవంశీ చూపెట్టబోతున్నాడు. దీనితో ఈ సినిమా పై గంపెడు ఆశలు పెట్టుకున్న ఈ యంగ్ విలన్ ఈ సినిమా విడుదల అయ్యాక ప్రేక్షకులు తనను ఎంత ద్వేషిస్తే తాను అంత సక్సస్ అయినట్లుగా భావిస్తానని అంటూ ఈ సినిమా విడుదల అయ్యాక చాలామంది తనను తిట్టుకోవడమే కాకుండా తన ఇంటిపైకి రాళ్ళ వర్షం కురిపించినా ఆశ్చర్యం లేదని అంటూ అలాజరిగితే బాగుంటుందని కోరుకుంటున్నాను అని అంటున్నాడు ఆదర్శ్.   మరి ఈ యంగ్ విలన్ కోరిక గోవిందుడు ఏమి చేస్తాడో చూడాలి. ప్రస్తుతం కేరళాలోని పొల్లాచ్చిలో జరుగుతున్న షూటింగ్ లో చరణ్ కు సవాల్ విసురుతూ ఈ యంగ్ విలన్ తన నటనతో అదర గోడుతున్నాడని ఈ ఫిలిం యూనిట్ ద్వారా బయటకు వస్తున్న టాక్. కృష్ణవంశీ అంచనాలను ఈ విలన్ బాలయ్య ఎంతవరకు చేరుకుంటాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: