నిన్న రాత్రి శిల్పాకళావేదికలో ' సికిందర్ ' సినిమా ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో హీరో సూర్య, హీరోయిన్ సమంతతోపాటు నాగార్జున, దర్శకుడు రాజమౌళి వంటి అతిరధ మహారధులు అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈమధ్య ‘బాహుబలి’ సినిమాలో సూర్య నటిస్తాడు అన్న వార్తలకు బలం చేకూరుస్తూ వేదిక పై మాట్లాడిన సూర్య రాజమౌళిని ఉద్దేసించి తనకు కూడ ‘బాహుబలి’ లో ఒక అవకాశం ఇమ్మని కోరాడు.  సూర్య ఇలా అంటూ ఉండగానే మధ్యలో సమంత కలుగ జేసుకుని సుర్యాకన్నా తానే ముందుగా ఈ సినిమాలో పాత్ర కావాలని తాను రాజమౌళిని అడిగానని అందువల్ల ముందు రాజమౌళి తనకు వేషం ఇవ్వాలని జోక్ చేసింది. అయితే వీరిద్దరి మాటలు విన్న జనంతో పాటు రాజమౌళి కూడ ఈ కోరికలను నవ్వుతూ ఆస్వాదించాడు.  ఇదే ఫంక్షన్ కు మరో అతిధిగా వచ్చిన నాగార్జున సుర్యాను ఆకాశానికి ఎత్తేస్తూ సూర్యాకు కోలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ అభిమానులు ఉన్నారని జోక్ చేసాడు నాగ్. అంతేకాకుండా తన భార్య అమల చెన్నైలో ఎయిడ్స్ క్యాంప్ ను నిర్వహించినప్పుడు సూర్య భార్య జ్యోతిక అందించిన సహాయం మరిచిపోలేను అని అన్నాడు నాగార్జున.  సమంతా, సూర్యల కోరిన కోరిక పై రాజమౌళి ఏమి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: