టాలీవుడ్ నెంబర్ 3 వ స్థానం లో అల్లు శిరీష్ నిలపడ్డాడు అంటే ఎవ్వరు నమ్మరు, కానీ ఈ అనుకోని అదృష్టం అల్లు వారి అబ్బాయి కి వచ్చింది. మెగా కుటుంబ హీరోల సినిమాలకు వాటి జయాపజయాలతో సంబంధం లేకుండా ఎటువంటి ఓపెనింగ్స్ వస్తాయో అందరికి తెలిసిన విషయమే. అటువంటి మెగా హీరోల సినిమాల హవా బుల్లితెరపై కూడ ఈసంవత్సరం నడిచింది. ఈ 2014 సంవత్సరం బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ సాధించిన మొదటి మూడు సినిమాలు మెగా ఫ్యామిలీకి చెందినవే కావడం సంచలనంగా మారింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రసారం అయిన పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం టీ ఆర్పీ రేటింగుల్లో అత్యధికంగా 19 పాయింట్లు సాధించి ప్రధమ స్థానంలో నిలిస్తే ఇక ఆతరువాత స్థానంలో రామ్ చరణ్ నటించిన ‘ఎవడు' చిత్రం 10.14 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. అయితే అందర్నీ ఆశ్చర్య పరుస్తూ కొద్ది నెలల క్రితం విడుదలై యావరేజ్ ఫలితాన్ని సాధించిన అల్లు శిరీష్ ‘కొత్త జంట’ బుల్లి తెర రేటింగ్స్ లో మూడవ స్థానం సంపాధించు కోవడమే కాకుండా 9.4 పాయింట్లు సాధించడం టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. అంతేకాదు బుల్లితెర టాప్ 3 పొజిషన్స్ అన్నీ మెగా కుటుంబ సినిమాలకే రావడం బట్టి ప్రేక్షకులలో మెగా కుటుంబ స్థాయి ఏ రేంజ్ లో ఉందొ అర్ధం అవుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: