టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన సినిమాలు చేసి, బాక్సాపీస్ వద్ద సక్సెస్ లు సాధించే డైరెక్టర్ గా బోయపాటి శ్రీనుకి ఒక ట్రేడ్ మార్క్ ఉంది. బోయపాటి మూవీలు అంటే కచ్ఛితంగా మాస్ అండ్ ప్యామిలీ డ్రామా కథలుగా ఉంటాయి. ముఖ్యంగా మన ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఏజ్ బార్ హీరోలకి బోయపాటి శ్రీను కరెక్ట్ గా సరిపోతాడని అంటారు. ఎందుకంటే బోయపాటి శ్రీను ఈ మధ్య తీసిన మూవీలలో లెజెండ్, సింహా మూవీలు బ్లాక్ బస్టర్ మూవీలుగా బాక్సాపీస్ వద్ద నిలిచాయి. బోయపాటి లో ఉన్న ఈ సక్సెస్ ఫార్ములాని ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోలు ఎవ్వరూ అర్ధం చేసుకోలేకపోతున్నారు. అలాగే ఈ యంగ్ హీరోలకి బోయపాటి శ్రీను అర్ధం అయ్యేలా చెప్పటం లేదు. ఎందుకంటే లెజెండ్ మూవీ తరువాత బోయపాటి శ్రీను దాదాపు అయిదుగురు యంగ్ హీరోలకి తను కథలను వినిపిస్తే అందులో రామ్ చరణ్ తప్పితే మిగతా హీరోలు ఎవ్వరూ బోయపాటి కథకి గ్రీన్ సిగ్నల్స్ వాళ్ళు లేరు. అల్లుఅర్జున్, నితిన్, నాని, మహేష్ బాబు, చిరంజీవి ఇలా ఎవ్వరిని వదలకుండా కథని వినిపించాడంట.ఏ హీరో దగ్గరకు వెళితే వారికి తగ్గ కథని తీసుకుపోయే యాక్షన్ తో సహా వినిపించేవాడంట. చివరకూ అందరూ నో అనేశాయి. అయితే రామ్ చరణ్ మొదట్లో ఒప్పుకున్నా తరువాత మాత్రం బోయపాటి శ్రీను ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. దీంతో ప్రస్తుతం బోయపాటి శ్రీను కథకి హీరోలు కరువయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా బెల్లంకొండ సురేష్ తన తనయుడు శ్రీనివాస్ సెకండ్ ప్రాజెక్ట్ ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయించాలని చూస్తున్నాడట. కొంత కాలం వరకూ మాస్ డైరెక్టర్ల చేతిలో కొడుకు మూవీలను ఉంచితే, తనకంటూ ఓ స్టార్ డం క్రియేట్ అవుతుందనే లెక్కల్లో బెల్లంకొండ సురేష్ ఉన్నట్టుగా తెస్తుంది. ప్రస్తుతం బడా హీరోలు ఎవ్వరూ బోయపాటిని దగ్గరకు రానివ్వక పోవటంతో, బోయపాటి శ్రీను సైతం బెల్లంకొండ శ్రీనివాస్ మూవీకి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: