సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అనాధ పిల్లలకు కూడ చేయూతను ఇచ్చే సమంతకు అమ్మ పిలుపు అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ‘మనం’ సినిమాతో సమంతకు ఎంత పేరు వచ్చిందో అంత ఇబ్బంది కూడ సమంతకు కలుగుతోంది అని వార్తలు వస్తున్నాయి. ‘మనం’ సినిమాలో నాగార్జున సమంతతో నటించిన ప్రతి సన్నివేశంలోను అమ్మ అంటూ నాగ్ ఆప్యాయంగా పిలుస్తూ ఉంటే ఆ సినిమాను చూసిన ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేసారు. నాగార్జున ‘మనం’ సెట్ పై నాగార్జున సమంతను ‘అమ్మా అమ్మా’ అని పిలిచిన అలవాటు ఇంకా పూర్తిగా మర్చిపోలేకపోతున్నాడు అని చెప్పే ఒక సంఘటన నిన్న హైదరాబాద్ లో జరిగింది. నాగ్ ముఖ్య అతిధిగా నిన్న పాల్గొన్న సూర్య సినిమా ‘సికిందర్’ ఆడియో ఫంక్షన్ లో వేదిక పై తనతో కలిసి కూర్చున్న సమంత వంక చూస్తూ అమ్మా అమ్మా అని సెటైర్లు వేయడం ఆ ఫంక్షన్ కు వచ్చిన అతిధులకు ఆనందాన్ని ఇస్తే ఆ ఫంక్షన్ కు వచ్చిన సమంతకు మాత్రం అసౌకర్యంగా మారి “నాగ్ సార్‌.. మీర‌లా పిలుస్తుంటే నాకు న‌చ్చ‌డం లేదు” అని గారాలు పోతూ ఆడియో వేదిక పై సమంత చేసిన హంగామా అందర్నీ ఆకర్షించింది.  ఇంతకీ సమంతకు అమ్మ బాధ తప్పేది ఎప్పుడో. ఈ బాధ ఇలాగే కొనసాగితే సమంత నాగ్ పై కూడ ట్విటర్ యుద్ధం మొదలుపెడుతుందేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: