నిన్న భాగ్యనగరంలోని శిల్పకళ రామంలో జూనియర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘రభస’ పాటల వేడుక అత్యంత అట్టహాసంగా జరిగింది. తన తాత నందమూరి తారకరామారావు ఆశీస్సులు అభిమానుల ఆదరణ తనకు ఎప్పుడు కావాలి అంటూ భావోద్వేగంగా జూనియర్ ఈ వేదిక పై మాట్లాడి ‘అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త ఆవకాయలా’ అంటూ పాటను పాడి అభిమానులను అలరించాడు. పాటల సీడీని తెలుగు తెర జక్కన్న రాజమౌళి ఆవిష్కరించగా దర్శకుడు వినాయక్ మొదటి సీడీని తీసుకుంటూ తాను ఎప్పటికైనా ‘అదుర్స్-2’ సినిమాను తీస్తానని అభిమానుల సమక్షంలో ప్రకటించాడు రాజమౌళి. జూనియర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసి నిన్న విడుదలైన ‘రభస’ ట్రయిలర్ కు మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఈ ట్రయిలర్ ను చూస్తూ ఉంటే రొటీన్ భారీ కథా చిత్రంలా కనిపిస్తోంది కాని ఎటువంటి వెరైటీ లేదు అనే మాటలు అప్పుడే ఆ ట్రయిలర్ చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ‘రభస’ ట్రయిలర్ లో ఫోర్స్ వుంది కానీ, ఎన్టీఆర్ పాత్రలో ఆ ఫోర్స్ కనిపించడం లేదని, ఆ ట్రయిలర్ ఎడిట్ చేయడంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని ఆ వేడుకకు వచ్చిన వారి టాక్. అమ్మ, తాత వంటి డైలాగులు ఎన్టీఆర్ సినిమాలో షరా మామూలే అయినా 'నేను ఆఫర్ ఇచ్చినపుడు తీసుకుంటే భరోసా--లేదంటే రభస' అన్న ఈ సినిమాలోని జూనియర్ పంచ్ డైలాగ్ ‘బృదావనం’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను గుర్తుకు చేస్తోంది అంటూ కామెంట్స్ వినిపించాయి. దీనిని బట్టి చూస్తుంటే ‘రభస’ జూనియర్ అభిమానులలో రభస చేయలేదా అని అనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: