జీవితా రాజశేఖర్ దంపతులకు చిరంజేవికి ఏమాత్రం పోసగదు అన్న విషయం ఓపెన్ సీక్రెట్. అటువంటి ఒక రియాల్టీ షోలో జీవిత ముందు ప్రభుదేవా, చిరంజీవి నామస్మరణ చేసి ఆమెకు షాక్ ఇచ్చాడు. ఇక వివరాలలోకి వెళితే రాఘవేంద్రరావు హోస్ట్ చేస్తున్న ‘సౌందర్య లహరి' కార్యక్రమంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన అందర్నీ ఆకర్షించింది. ఈ షోలో నటి జీవితతో పాటు దర్శకుడు, డాన్సర్, నటుడు అయిన ప్రభుదేవా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీవిత ప్రభుదేవాను పలు ప్రశ్నలు అడిగింది. ‘మీకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నచ్చిన డాన్సర్ ఎవరు?' అని జీవిత అడిగిన ప్రశ్నకు ప్రభుదేవా సమాధానం ఇస్తూ చిరంజీవి నా ఫేవరెట్ డాన్సర్ అంటూ ఒక బాంబ్ పేల్చాడు.  అప్పటి దాకా ఆ షోలో సరదాగా కబుర్లు చెప్పిన జీవిత, చిరంజీవి మాట ప్రభుదేవా నోటి వెంట రాగానే జీవిత ఫేస్ లో రంగులు మారడం స్పష్టంగా బుల్లి తెర పై కనిపించింది. అయితే మెగా స్టార్ స్థానాన్ని ఆక్రమించుకున్న చిరంజీవి పేరు కాకుండా మరెవ్వరి పేరు ప్రభుదేవా చెపుతాడు అని జీవిత ఊహించిందో తెలియదు.  ఒక వైపు ఆమె భర్త రాజశేఖర్ చిరంజీవితో నటించాలని ఉంది అని చెపుతుంటే మరో వైపు జీవిత చిరంజీవి పేరు చెప్పగానే మూతి ముడుచుకోవడంలోని అర్ధం ఆమెకే తెలియాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: