మాస్ మహారాజా రవితేజాకు ప్రేక్షకులలో మంచి ఇమేజ్ ఉన్నా ప్రస్తుతం నడుస్తున్న టాప్ యంగ్ హీరోల రేసులో రవితేజా బాగా వెనక పడిపోయాడు అనేడి వాస్తవం. ఆరు సినిమాల వరస ఫ్లాప్ ల తరువాత ‘బలుపు’ ద్వారా హిట్ సాధించినా రవితేజా సినిమా కలెక్షన్స్ 30 కోట్ల మార్క్ ను మించిన దాఖలాలు లేవు. అందువల్లే రవితేజా సినిమా మార్కెట్ కూడ 30 కోట్ల లోపే ఉంటుంది. కానీ ‘పవర్‌’ చిత్రానికి బడ్జెట్‌ 35 కోట్ల పైగానే అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో యాక్షన్‌ పార్ట్‌ ఎక్కువ ఉండడంతో ఖర్చు అనుకున్న దాని కన్నా ఇంత ఎక్కువగా అయిందని ఫిలింనగర్ టాక్. అయితే ‘పవర్’ సినిమా ఆడియో విడుదల తరువాత కూడ ఈ సినిమాకు అనుకున్న స్థిలో బిజినెస్ కాకపోవడం ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలకు షాకింగ్ గా మారింది అని అంటున్నారు. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇప్పటికి ఈసినిమా 23 కోట్లు బిజినెస్‌ మాత్రమే చేయగలిగిందట.  దీనితో నష్టాలతోనే ‘పవర్’ రిలీజ్ కావచ్చు అనే వార్తలు వినపడుతున్నాయి. ఏమైనా రవితేజా ‘పవర్’ ఆ సినిమా నిర్మాతకు విడుదల కాకుండానే గట్టి షాకులు ఇస్తోంది అనే సెటైర్లు ఫిలింనగర్ లో వినపడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: