తిక్కుంది దానికో లెక్కుంది'' అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో అప్పటి వరకు ఉన్న పాత రికార్డులను అన్నింటిని తిరగరాసి కొత్త రికార్డులను సెట్ చేసి మళ్ళీ తనే తన ''అత్తారింటికి దారేది '' సినిమాతో తెలుగు సినిమాకి వంద కోట్ల దారిని చూపెట్టిన ఘనత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతం . ప్రస్తుతం సీనియర్ నటుడు ,తనకు వ్యక్తిగతంగా చాలా చాలా ఇష్టమైన హీరో విక్టరీ వెంకటేష్ తో కలిసి ''గోపాల గోపాల '' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ నెలలోనే ఆ చిత్రం తాలూకు తన పోర్షన్ అంతా కంప్లీట్ చేయాలనీ భావిస్తున్నాడు పవన్ కళ్యాణ్ . ఇక వచ్చేనెల నుండి మళ్ళీ గబ్బర్ సింగ్ 2కోసం తన సమయాన్ని కేటాయించనున్నాడు,అలాగే జనసేన రాజకీయ పార్టీకి సంబందించిన పనులను కూడా పర్యవేక్షించనున్నాడు పవన్ కళ్యాణ్ . ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే తన తదుపరి ప్రాజక్ట్ పై ద్రుష్టి సారిస్తూ ....... జనసేన ని గ్రేటర్ ఎన్నికల కోసం సమాయత్తం చేయడం కోసం పవన్ ప్రణాలికలను సిద్దం చేస్తున్నాడు. ఇక గబ్బర్ సింగ్ 2 చిత్రం అక్టోబర్ లో తప్పకుండా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంతుందట ఎందుకంటే ప్రారంభం జరిగి చాలా కాలం కావడంతో రకరకాల వార్తలు వస్తుండటంతో ఎలాగైనా అక్టోబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేయాలనీ భావిస్తున్నాడు పవన్ . సంపత్ నంది కూడా గాలిపటం లోంచి బయటపడి గబ్బర్ సింగ్ పనుల్లో బిజీ కానున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: