సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ ప్రవేసం పై మరోసారి ఊహాగానలకు తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు తన రాజకీయ ప్రవేశం పై మీడియాలో వార్తలు వచ్చినా గట్టిగా రజనీ ఎప్పుడు స్పందించలేదు. ప్రతీసారి ఈవిషయం పై దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే రెండురోజుల క్రితం బెంగుళూరులో రజనీ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అనేక అర్ధాలు వచ్చేవిధంగా రజనీకాంత్ ప్రతిస్పందించడం కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లోకి వస్తారా? అంటూ ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ. ‘దేవుడు నడిపిస్తే ఆ వైపు తప్పకుండా నడుస్తాను' అని స్పందించడం బట్టి మరో రెండు సంవత్సరాలలో తమిళనాడులో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని  రజనీకాంత్ అన్న మాటలు సంకేతంగా భావించాలి అంటూ కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల అవుతున్న ‘లింగా' అనుకున్న విధంగా ఘన విజయం సాధిస్తే రజనీ రాజకీయ రంగ ప్రవేశం ఖాయం అనుకోవాలి. ఇదే జరిగితే తమిళనాడులో పెను మార్పులు రావడం ఖాయం. మరి రాబోతున్న రోజులలో దేవుడు ఈ ‘అరుణాచలాన్ని’ ఎలా సాసిస్తాడో చూడాలి...  

మరింత సమాచారం తెలుసుకోండి: