ఒకొక్కసారి టాప్ హీరోల సినిమాలను చిన్న సినిమాలు దెబ్బతీయడం సంచలనంగా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా అదే జరిగింది. ఒక డబ్బింగ్ సినిమాను 15 కోట్లకు మోజుపడి కొన్నారు అంటే హీరో సూర్య పై ఎటువంటి నమ్మకాన్ని మన తెలుగు నిర్మాతలు పెట్టుకున్నారో అర్ధం అవుతుంది.  నిన్న విడుదలైన ‘సికిందర్’ తెలుగు వారి  ఇరు రాష్ట్రాలలోను 400ల ధియేటర్లకు పైగా విడుదల కావడం ఆ సినిమాకు ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ కు ఏర్పడ్డ క్రేజ్ మన టాప్ టాలీవుడ్ హీరోలను కూడ ఖంగారు పెట్టింది. అయితే ఈ హడావిడి అంతా నిన్న ఒక్కరోజుకే పరిమితం కావడం సంచలనంగా మారింది. నిన్న విడుదలైన సూర్య ‘సికిందర్’ మొదటి రోజు మొదటి ఆట నుండి ఫ్లాప్ టాక్ తెచ్చు కావడంతో రెండవ రోజు నుండి ఈ సినిమా ధియేటర్లు అన్నీ బోసిపోయాయి. అయితే అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఈ సినిమాతో పోటీగా విడుదల అయిన మారుతి ‘లవర్స్’ యూత్ లో మంచి టాక్ తెచ్చుకోవడమే కాకుండా ఈ సినిమాలో నటించిన సప్తగిరి కామెడీతో ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ‘లవర్స్’ హిట్ టాక్ తెచ్చు కోవడానికి క్రెడిట్ అంతా సప్తగిరి ఖాతాలోకి వెళ్ళిపోయి ప్రస్తుతం ఆ సినిమాకు హీరోగా సప్తగిరి మారిపోయాడు. జూనియర్ ‘రభస’ వచ్చే వరకు చెప్పుకోతగ్గ సినిమాలు ఏమి లేకపోవడంతో సప్తగిరి హాస్యం ‘లవర్స్’ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించచబోతోంది. ఏమైనా ఒక టాప్ హీరోకి ఒక యంగ్ కమెడియన్ ఝలక్ ఇవ్వడం ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది డే గా మారింది .  

మరింత సమాచారం తెలుసుకోండి: