పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాపాటలోని ‘కిర్రాక్’ ఎంత క్రేజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అదే పదాన్ని సినిమా టైటిల్ గా చేసుకుని మహేష్ పవన్ ల ప్రస్తావనతో హారిక్ అనే నూతన దర్శకుడు చేస్తున్న ప్రయోగం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. చిన్న బడ్జెట్ సినిమాగా రూపొందిన ఈ సినిమా వచ్చే నెల విడుదల అవుతున్న భారీ బడ్జెట్ సినిమాలు ‘పవర్’, ‘ఆగడు’ లమధ్య విడుదల కావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. బీటెక్ చేసిన హారిక్ విదేశాలలో సినిమా దర్శకత్వం పై కోర్స్ చేసి ఒక విభిన్న చిత్రంగా ఈ కిర్రాక్ ను నిర్మిస్తున్నాడు.  అనిరుద్, చాందినీ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ అభిమాని అయితే హీరోయిన్ మహేష్ బాబు అభిమాని. లవ్ స్టోరీగా నిర్మాణం అవుతున్న ఈసినిమాలో పవన్, మహేష్ లపై చాల డైలాగ్స్ ఉంటాయని ఈ దర్శకుడు చెపుతున్నాడు. అయితే పవన్ మహేష్ ల సినిమాలలోని పాటలను గాని, డైలాగ్స్ ను గాని పేరడీ చేస్తూ తాను కిర్రాక్ లో ఉపయోగించడంలేదని ఒక లవ్ స్టోరీ ద్వారా పవన్ మహేష్ ల అభిమానులకు ఒక సందేశాన్ని పంపే ప్రయత్నం తాను చేస్తున్నాని చెపుతున్నాడు దర్శకుడు హారిక్.  ఒక టాప్ హీరో సినిమాలోని పాటలను డైలాగ్స్ ను వాడుకుంటూ తీసిన సినిమాలను గతంలో చూసాం. కానీ సినిమా అంతా మహెహ్ పవన్ ల ప్రస్తావనతో నడిచే ఈ సరికొత్త ప్రయోగాన్ని ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: