విడుదల కాకుండానే బిజినెస్ బాగానే జరిగింది అనే పేరు తెచ్చుకున్న పవర్ సినిమా ౩౦ కోట్ల వరకు బిజినెస్ చేసింది అని ఫిలింనగర్ టాక్. జూనియర్ ‘రభస’ కోసం సెప్టెంబర్ 5వ తారీఖుకు మారిన రవితేజా ‘పవర్’ కు ఒక విచిత్ర సమస్య వచ్చింది.  రవితేజా సినిమాను మోజుపడి కొనుక్కున్న బయ్యర్లు మాత్రం సెప్టెంబర్ 5న పవర్ ను విడుదల చేయవద్దని ఆ సినిమా నిర్మాత పై ఒత్తిడి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం జూనియర్ ‘రభస’ అని అంటున్నారు. ‘రభస’ ఈ నెలాఖరుకు వినాయకచవితి రోజున విడుదల అవుతూ  అత్యధిక దియేటర్లను ఈ సినిమా ఇరు రాష్ట్రాలలోను కబ్జా చేస్తూ ఉండటంతో కనీసం ‘రభస’ విడుదలైన రెండు వారాల వరకు సరైన ధియేటర్లు దొరకవు కాబట్టి ‘పవర్’ ను సెప్టెంబర్ రెండవ వారానికి విడుదల చేస్తేనే తాము ఈ ‘పవర్’ ను కొంటామని నిర్మాతలకు బయ్యర్లు కండిషన్ పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  కానీ బయ్యర్ల కోరిక మేరకు ‘పవర్’ ను సెప్టెంబర్ రెండవ వారంలోకి తీసుకు వస్తే సెప్టెంబర్ నెలాఖరుకు రాబోతున్న ‘ఆగడు’ ఆ వెనువెంటనే వస్తున్న చరణ్ ‘గోవిందుడు’ మధ్య ‘పవర్’ నలిగిపోతుందని నిర్మాతలు భయపడుతున్నట్లు టాక్. ఒకవైపు బయ్యర్ల ఒత్తిడి మరో వైపు తరుముకు వస్తున్న భారీ సినిమాల హడావిడి మధ్య ‘పవర్’ నలిగి పోతోంది అనే వార్తలు వస్తున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: