‘బాయ్స్’ సినిమా నుండి ‘రోబో’ వరకు శంకర్ తీసిన ప్రతి సినిమా విభిన్నంగా ఉంటుంది. 1990 నుండి దక్షిణాది సినిమా రంగ నిర్మాణ పద్ధతిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన గొప్ప దర్శకుడు శంకర్. దక్షిణాది సినిమాను మొట్టమొదటి సారిగా 100 కోట్ల మైలురాయిని దాటించిన ఘనత శంకర్ ది. అటువంటి విలక్షణ దర్శకుడు తన పుట్టినరోజు అయిన ఈరోజు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలామందికి తెలియని విషయాలు బయట పెట్టాడు. సినిమాలలోకి రాక ముందు శంకర్ చెన్నైలోని హాల్డా కంపెనీలో కార్మికుడిగా పని చేసేవాడట. అప్పుడు కార్మిక సంఘ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ ఒక వివాదంలో చిక్కుకుని మూడు రోజుల జైలు శిక్ష కూడ అనుభవించానని చెపుతున్నాడు శంకర్.  దర్శకుడిగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన శంకర్ కు రకరకాల రిస్ట్ వాచీలంటే విపరీతమైన ఇష్టమని చెపుతూ తన ఇంటిలోని ఒక గదిని రిస్ట్ వాచ్ ల మ్యూజియంగా మార్చేసానని చెపుతున్నాడు శంకర్. వందలాది కోట్లతో భారీ సినిమాలు తీసే శంకర్ కు తాను వేసుకునే డ్రస్ లు సెలెక్ట్ చేసుకోవడం రాదనీ ఇప్పటికీ తన భార్యే తనకు అన్నీ సెలెక్ట్ చేస్తుందని చెపుతున్నాడు శంకర్. షూటింగ్ లోకేషన్స్ లో ఎవరు మాట్లాడినా సిల్లీ జోక్స్ వేసినా తనకు ఏకాగ్రత దెబ్బతిని ఆరోజు షూటింగ్ మానేస్తానని చెపుతున్న శంకర్ సిగరెట్ల అలవాట్ల నుండి ఎలా బయట పడాలో రజినీకాంత్ కే సలహా ఇచ్చానని చెపుతున్నాడు ఈ దర్శకుడు. క్రియేటివిటీ తో కూడిన సోషల్ రేస్పాన్సిబిలిటీకి చిరునామాగా మారాడు శంకర్ ..  

మరింత సమాచారం తెలుసుకోండి: