‘సుడిగాడు’ సినిమా తరువాత ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా అల్లరి నరేష్ కు కలసి రాకపోవడంతో ప్రస్తతం అల్లరి నరేష్ కెరియర్ ప్రశ్నార్ధకం గా మారింది. అయినా మన అల్లరోడు తన ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. అల్లరి నరేష్ సినిమాలు అంటేనే వెరైటీ టైటిళ్ల‌కు ప్ర‌సిద్ది. గ‌మ్మ‌త్తైన పేర్ల‌తో జ‌నాన్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డంలో అల్లరి నరేష్ కు ఉన్న తెలివితేటలు మరి యే హీరోలకు లేవు అని అంటారు.  గతంలో ‘అత్తిలి స‌త్తిబాబు’, ‘సీమ‌ట‌పాకాయ్‌’, ‘బెండు అప్పారావు’, ‘కితకితలు’ అంటూ వరస పెట్టి హిట్స్ కొట్టి టాలీవుడ్ మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు. అయితే ఈమధ్య ఆ ట్రాక్ తప్పడం తో మ‌రోసారి మరో వెరైటీ టైటిల్‌తో ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తతం అల్లరి నరేష్ నటిస్తున్న కోత్త సినిమాకు ”బ్ర‌ద‌రాఫ్ బొమ్మాళీ” అనే పేరు నిశ్చయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అల్ల‌రి న‌రేష్, మోనాల్ గ‌జ్జ‌ర్ తో నటిస్తున్న ఈ సినిమాలో ఒకనాటి హీరోయిన్ రాధ కూతురు కార్తీక కీల‌క పాత్ర పోషిస్తోంది చిన్ని కృష్ణ ద‌ర్శ‌కుడు. బొమ్మాళీ లాంటి చెల్లాయి ఉంటే, ఆ అన్న‌య్య ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఈ సినిమా స్టోరీ అట. మొదట్లో ఈ సినిమాకు నాటుబాంబు అనే పేరు అనుకున్న దానికంటే ‘బ్ర‌ద‌రాఫ్ బొమ్మాళీ’ అయితేనే క‌థ‌కు అనుగుణంగా ఉంటుంద‌ని ఫిలిం యూనిట్ భావించడంతో ఈ సినిమా పేరును త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని ఫిలిం నగర్ టాక్ . అనుష్కకు క్రేజ్ ఇచ్చిన ఈ బొమ్మాళీ అల్లరోడికి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: