ఈనెల ఆగస్టు 29 నుండి టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా షుమారు నెల రోజుల వ్యవధిలో నాలుగు పెద్ద సినిమాలతో పాటు మరో మూడు బుల్లి సినిమాల ఫైట్ కు వేదికగా టాలీవుడ్ సినిమా రంగం కావడం అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా తెలుగు చలన చిత్ర నిర్మాణ మండలిను కూడ షేక్ చేస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. దసరా, సంక్రాంతులకు ఇద్దరి బడా హీరోల మధ్య పోటీగా ఉండే టాలీవుడ్ ఈ సారి ఏకంగా నెల రోజుల వ్యవధిలో రాబోతున్న దసరాను టార్గెట్ చేసుకుని వస్తున్న నాలుగు భారీ సినిమాల మధ్య జూదం నిర్మాతల మధ్య పోటీగా మారింది. ఎప్పుడు లేని విధంగా కేవలం నెల రోజుల వ్యవధిలో జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, మహేష్‌బాబు, రామ్‌చరణ్‌లు తమతమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతు ఉండటం సంచలనంగా మారింది. ఈ నెల 29న థియేటర్లలోకి రాబోతున్న జూనియర్ ‘రభస’ తరువాత మాస్ మహారాజు గతంలో నటించిన ‘పవర్’ ఆ తరువాత మహేష్ ‘ఆగడు’ వెనువెంటనే రామ్ చరణ్ ‘గోవిడుడు అందరివాడేలే’ సినిమాలు క్యూ కట్టి వస్తున్నాయి. ఇవి కాకుండా మధ్యలో నాగచైతన్య ‘ఒక లైలా కోసం’, వర్మ, విష్ణుల ‘అనుక్షణం’ తో పాటు మరో రెండు సినిమాలు కూడ రాబోతున్నాయి.  ఈ విధంగా కేవలం నెల రోజుల గ్యాప్ లో 7 సినిమాలు విడుదల అవుతూ ఉండటంతో నిర్మాతల మధ్య విభేదాలతో పాటు ధియేటర్ల సమస్య కూడ తీవ్రతరం అయ్యే పరిస్థుతులు కనిపిస్తున్నాయి. ఒక భారీ బడ్జెట్ సినిమా నష్టాలు లేకుండా బయట పడాలి అంటే కనీసం మూడు వారాల పాటు ఇరు రాష్ట్రాలలోను అత్యధిక ధియేటర్లలో ప్రదర్సించ వలసిన వరిస్థితి ఏర్పడింది. ఇలా జరగకుంటే నిర్మాత భారీగా నష్ట పోతాడు. ఇంత తక్కువ సమయంలో టాప్ హీరోల సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా రావడం వల్ల తాము లాస్ అవుతున్నామని నిర్మాత, డిస్ర్టిబ్యూటర్ దిల్‌రాజు అన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే దిల్‌రాజు రభస, పవర్ మూవీల నైజాం డిస్ర్టిబ్యూషన్ రైట్స్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతిని పరిగణంలోకి తీసుకుని చూస్తే తెలుగు సినిమాలకు దసరా అంత భారీ మార్కెట్ కాదు కాని కేవలం ఈ పండుగను నమ్ముకుని 300కోట్ల జూదం జరగడం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: