నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇప్పుడు టాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాడు. ఇప్పటివరకు తాను హీరోగా సెటిల్ అవుదామని రకరకాల ప్రయోగాలు తనపై తాను చేసుకున్న కళ్యాణ్ రామ్ రవితేజ హీరోగా చిత్రం రూపొందించటానికిసర్వం సిద్దం చేసుకున్నాడు రవితేజాతో ‘కిక్’ సీక్వెల్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలు అయింది. ‘రేసుగుర్రం' సూపర్ హిట్ తరువాత సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈనెల 20నుంచి ప్రారంభం కాబోతుంది. కిక్ సినిమాకు మించిన ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉండేలా దర్శకుడు సురేంద్ర రెడ్డి ప్లాన్ చేస్తున్నాడని టాక్. ‘కిక్’ సినిమాలో రవితేజా పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత కిక్ సినిమా ముగుస్తుంది కాబట్టి ఈ సీక్వెల్ లోకుడా పోలీస్ పాత్ర కొనసాగుతుందా లేకుంటే రవితేజాను మరోలా చూపిస్తాడా అన్న విషయం పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్ లో రవితేజాకు జంటగా తమన్నా నటిస్తుంది అనే వార్తలు గట్టిగా వినిపిస్య్తున్నాయి.  ఇదే ఇలా ఉండగా రవితేజాను ఈ సీక్వెల్ లో నటించడానికి ఒప్పించడానికి కళ్యాణ్ రామ్ రవితేజా కెరియర్ లోనే భారీ పారితోషికంగా 8 కోట్లు ఈ నందమూరి హీరో ఆఫర్ చేసాడని టాక్. దీనిని బట్టి చూస్తూ ఉంటే రవితేజాకు కళ్యాణ్ రామ్ అదృష్ట లక్ష్మిగా మారాడు అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: