నిన్న జరిగిన కృష్ణాష్టమి రోజున పవన్ నటిస్తున్న ‘గోపాలా గోపాలా’ ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని అందరు అనుకుంటే పవన్ రాని లోటును పవన్ అబ్బాయి వరుణ్ తేజ్ తీర్చాడు. వరుణ్ తేజ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు ‘ముకుందుడు’ గా నిన్న కృష్ణాష్టమి రోజున టైటిల్ ఫైనల్ చేసారు.  ఈ సినిమా ఫస్ట్ లుక్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాకుండానే ఈ సినిమా బిజినెస్ ప్రారంభమైందని సమాచారం. ఈ సినిమా ఆడియో రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ 45 లక్షలకు తీసుకున్నట్టు టాక్. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 23న దీపావళి స్పెషల్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దసరాను రామ్ చరణ్ ‘గోవిందుడు’ దీపావళిని వరుణ్ తేజ్ ‘ముకుందుడు’ సంక్రాంతిని పవన్ ‘గోపాలా గోపాలా’ వరుస పెట్టి పంచుకోవడంతో రాబోతున్న మూడు పెద్ద పండగలలోను మెగా కుటుంబ హడావిడి కనిపించబోతోంది.  ఇప్పటికే మెగా కుటుంబ హీరోల సంఖ్య పెరిగిపోతు ఉండటంతో ఇక రాబోతున్న రోజులలో సంవత్సరంలోని ప్రతి నేలలోను మెగా కుటుంబ సినిమాల హడావిడికి చిరునామాగా టాలీవుడ్ మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: