బ్రహ్మి పాత్ర ఉంటే చాలు ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని టాలీవుడ్ టాప్ హీరోలంతా భావిస్తూ ఉంటే కోలీవుడ్ టాప్ హీరో సూర్యా మటుకు తన ఫెయిల్యూర్ కు బ్రహ్మానందాన్ని టార్గెట్ చేస్తున్నాడు. మొన్న శుక్రువారం తమిళ, తెలుగు భాషలలో భారీ స్థాయిలో విడుదలైన సూర్య ‘సికిందర్’ సినిమాను సూర్యా అభిమానులు కూడ భరించ లేకపోవడంతో భయoకరమైన ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది.  ఈ సినిమా ఇంత ఘోరంగా ఫెయిల్ అవడానికి గల కారణాలను ఈ సినిమా యూనిట్ విశ్లేషించి 170 నిముషాల సినిమాను కొంత వరకు తగ్గిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అన్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది అనే వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాలో దాదాపు ఆరు నిముషాల పాటు వచ్చే బ్రహ్మనందం కామెడీ ట్రాక్ ను ఈరోజు నుంచి ఆ సినిమాలో తోలిగిస్తున్నట్లుగా టాక్. సామాన్యంగా బ్రాహ్మి కామెడీని విపరీతంగా ఎంజాయ్ చేసే తెలుగు ప్రేక్షకులు కూడ సూర్యా, సమంతా బ్రహ్మనందంల మధ్య తీసిన ఆ కామెడీ ట్రాక్ ను చూసి తీవ్ర అసహనానికి లోనయ్యారు. దీనితో బ్రహ్మి పాత్ర ఈ సినిమా నుండి పూర్తిగా మాయం అయిపోతోంది. అయితే ఇప్పటికే భయంకరమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఎటువంటి రిపేర్లు చేసినా ప్రయోజనం ఉండదు అని అంటున్నారు విశ్లేషకులు. కధ గురించి ఆలోచించ కుండా సూర్యా లాంటి టాప్ హీరోలు కూడ ఇలాంటి భారీ సినిమాలు చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఏమైనా బ్రాహ్మికి ఇది పెద్ద షాక్ అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: