మహిళల పై అత్యాచారాలు వేధింపులు రోజురోజుకు పెరిగి పోతున్న నేపధ్యంలో ఈ లిస్టులో మన హీరోయిన్స్ కూడ చేరిపోతున్నారు. పవన్ కళ్యాణ్ తో ‘తీన్ మార్’ లో నటించి ఆ తరువాత యంగ్ హీరోలు మనోజ్, రామ్ లతో నటించినా కలిసి రాక పోవడంతో యంగ్ హీరోయిన్ కృతి కర్భందా ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాలలో నటిస్తూ తన రోజులను గడుపుతోంది.  తన సినిమా షూటింగ్ ల నిమిత్తం తరుచూ విమానాలలో తిరిగే ఈ బ్యూటీకి అదే ఎయిర్ పోర్టులకు సంబంధించిన కొంతమంది స్టాఫ్ నుండి వేధింపులు వస్తున్నాయి అంటూ స్వయంగా ఆమె మీడియాకు తెలపడం సంచలనంగా మారింది.  ఆమె చెపుతున్న వివరాలను బట్టి కొద్ది రోజుల క్రితం నుంచి ఆమెకు తెలియని రకరకాల నెంబర్ల నుండి తాను చాల అందంగా ఉన్నాను అంటూ అసభ్య పదజాలంతో వస్తున్న ఫోన్స్ ను చూసి బెదిరిపోయిన కృతి అసలు విషయం లోతులోకి వెళితే తనకు అటువంటి కాల్స్ చేస్తున్నది ఒక ఎయిర్ పోర్ట్ ఉద్యోగి అని తెలిసిందట. తాను తరుచూ విమానాలలో తిరుగుతూ ఉండటంతో తన సెల్ నెంబర్ ను ఎయిర్ పోర్ట్ డేటా బేస్ నుండి తీసుకుని తనను ఇలా అసభ్యంగా ఆ ఎయిర్ పోర్ట్ ఉద్యోగి వేధిస్తున్నాడు అంటూ గగ్గోలు పెడుతోంది. అంతేకాదు తాను చాల భయంగా రోజులు గడపాల్సి వస్తోందని ఆమె భయపడి పోతోంది. సెలేబ్రేటీల లాంటి తనకే ఇటువంటి కష్టాలు వస్తూ ఉంటే సామాన్య అమ్మాయిల పరిస్థితి ఏమిటి అడుగోతోంది కృతి కర్భందా... 

మరింత సమాచారం తెలుసుకోండి: