ఒక డైలాగ్ రైటర్ గా ఉంటూ ఒక స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కోన వెంకట్ తాను మాట్లాడే మాటలలో మటుకు చాల షార్ప్ గా ఉంటాడు. విలక్షణ రచయితగా పేరు గాంచిన ఈయన నిన్న ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆశక్తికర విషయాలను తెలియ చేసాడు.  తాను ఒక గచ్చిబౌలి లాంటి వాడిని అంటూ సిటీ పెరగడంతో గచ్చిబౌలికి డిమాండ్ ఎలా పెరిగి పోయిందో ప్రస్తుతం హాయిగా నవ్వుకునే డైలాగ్స్ కు క్రేజ్ పెరగడంతో తనకు కూడ డిమాండ్ పెరిగిందని తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు వెంకట్. ప్రస్తుతం ఒక కధను తాను రాస్తే 50 లక్షల నుండి 1 కోటి వరకు తాను తీసుకుంటున్నానని చెపుతూ అంతా వైట్ మనీగా తీసుకోవడంతో తాను ధైర్యంగా చెప్ప కలుగుతున్నానని అన్నాడు వెంకట్. తన కధకు దర్శకత్వం వహించే దర్శకులు, హీరోలు కోట్లాది రూపాయలలో పారితోషికాలు తీసుకుంటూ ఉంటే ఆ కధను సృస్టించిన రచయితగా ఆ మాత్రం డిమాండ్ చేయడం తన హక్కు అని అంటున్నాడు కోన వెంకట్. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు ఆ సినిమాలో నటించిన హీరోను, దర్శకుడిని ఆకాశానికి ఎత్తేసే మీడియా ఆ సినిమాకు కధను ఇచ్చిన తల్లి లాంటి రచయితను పట్టించుకోకపోవడం తనకు బాధను కలిగించడమే కాకుండా చాల అవమానంగా భావిస్తానని కోన వెంకట్ అభిప్రాయ పడుతున్నాడు. 1996లో ‘తోక లేని పిట్ట’ సినిమా తీసి ఆరోజుల్లోనే 82 లక్షలు పోగొట్టుకుని అన్నీ పోగొట్టుకున్న తనలో ఒక రచయిత ఉన్నాడు అని గ్రహించిన రామ్ గోపాల్ వర్మ చలవతోనే తాను ఈనాడు రచయితగా మారానని చెపుతూ వర్మ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు కోన వెంకట్.

మరింత సమాచారం తెలుసుకోండి: