వర్మఅతి తక్కువ ఖర్చుతో ‘ఐస్ క్రీమ్’ తీస్తే అది ఎవరు తినకుండానే కరిగి పోయింది. దానితో కోపం వచ్చిన వర్మ సహకార పద్ధతిలో సినిమాలు ఎలా తీయాలో పాఠాలు చెప్పి యూట్యూబ్ లో పెడితే దానిపై కూడ సెటైర్లు వేసారు. ఇక లాభంలేదు అనుకుని వర్మ సినిమా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లో న్యూ ‌ట్రెండ్ అంటూ ఆన్‌లైన్‌లో వేలంపాట‌కు శ్రీకారం చుట్టి ఆలోచన తనది ఆచరణ మంచువారి అబ్బాయిది అంటూ భారీ ప్రకటనలు ఇచ్చాడు. తమ తొలి ప్రయోగాన్ని విష్ణు నిర్మిస్తున్న ‘అనుక్షణం’ సినిమాపై ప్రయోగించాడు. మొదట్లో ఈ ఆన్ లైన్ సినిమా వేలం ప్రక్రియకు ప్రతిస్పందన బాగా వచ్చినా చివరకు వచ్చే సరికి వర్మ పద్ధతి అర్ధం కాక ఈ ఆన్ లైన్ వేలం పాటలో పాల్గొన్న చాలామంది వెనక్కు వెళ్లి పోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.  దీనికి కారణం ఆ మధ్య వర్మ నిర్మించిన ‘ఐస్ క్రీమ్’ సినిమాలాగే అనుక్షణం కూడా చిన్న బడ్జెట్ సినిమా అనుకున్నారట. ఈ మూవీ కూడ వర్మ 10, 20 లక్షల్లో తీశాడేమో అనుకున్న వేలం పోటీదార్లు ఆ రేంజ్‌లోనే కొటేషన్స్ వేయడంతో అటు వర్మకు ఇటు విష్ణుకు షాకింగ్ న్యూస్ గా మారింది అని టాక్. ఆన్ లైన్ వేలం గడువు తేదీని పొడిగించినా రెస్పాన్స్ లేకపోవడంతో చేసేది లేక ఈ సినిమాను సెప్టెంబర్ 12కు రిలీజ్ వాయిదా వేశారని ఫిల్మ్‌నగర్ టాక్. వర్మ చేసిన ప్రయోగంతో విష్ణు కూడ ఇబ్బందులలో పడ్డాడు అంటు సెటైర్లు వినిపిస్తున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: