ప్రతి విషయాన్ని మీడియా గమనిస్తూ ఉండటంతో సెలెబ్రెటీలు రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఎంత రహస్యంగా ఉంచుదామనుకున్నా జనంలోకి క్షణాలలో ఆ వార్తలు వెళ్ళి పోతున్నాయి. అటువంటి సందర్భమే అల్లుఅర్జున్ విషయంలో కూడ లేటెస్ట్ గా జరిగింది. గత శుక్రువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన బాధ్యతలు నిర్వర్తించడం కూడ దేశ భక్తి అని సందేశం ఇస్తూ ‘ఐయామ్ దట్ చేంజ్’ షార్ట్ ఫిలిం విడుదల చేసి ప్రసంసలు పొందిన అల్లుఅర్జున్ కొన్ని రోజులు కూడ తిరగకుండానే బన్నీ కారును పోలీసులు చెక్ చేసారు అనే న్యూస్ తో కూడిన వీడియో వెబ్ మీడియాలో హడావిడి చేయడం సంచలనంగా మారింది.  అల్లుఅర్జున్ ప్రయాణిస్తున్న ఖరీదైన ఆ బెంజ్ కారులో డ్రైవర్ సీట్ లో ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాడు. అంతేకాకుండా పోలీసులు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు కూడ ఇస్తున్నాడు. అయితే డ్రైవింగ్ సీట్లో ఉన్న బన్నీ మాత్రం కొద్దిగా అసహనంగా కనిపించాడు. ఆ తరువాత పోలీసులు చెకింగ్ పూర్తి చేయడంతో బన్నీ కారు వెళ్ళి పోవడం కనిపిస్తుంది.  అయితే అంత రాత్రివేళ బన్నీ ప్రయాణిస్తున్న ఆ కారులోని సంఘటనను ఎవరు షూట్ చేసారు దానిని ఎవరు వెబ్ మీడియాకు లీక్ చేసారు అనే విషయాల పై క్లారిటీ లేదు. ఏమైనా మార్పు కోసం షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్న బన్నీ కేవలం కొద్ది రోజుల గ్యాప్ తో వెబ్ మీడియాలో ఇలా కనిపించడం ఇదో రకం మార్పు అని అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: