నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1991లో నటించిన ‘సీతారామయ్య గారి మనవరాలు’ ఆ రోజులలో సూపర్ హిట్ కావడమే కాకుండా ఆ సినిమాలో నటించిన అక్కినేనితో పాటు మనవరాలు పాత్ర చేసిన మీనాకు కూడ చాల మంచి పేరును తెచ్చి పెట్టింది. అయితే అప్పట్లో విడుదలైన ఆ సినిమా కధను కొద్దిగా మార్పులు చేసి రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడే’ గా మార్చారు అనే వార్తలు వస్తున్నాయి.  మొదట్లో ‘గోవిందుడు’ సినిమా కృష్ణవంశీ రూపొందించిన ‘మురారి’ సినిమా కధను పోలి ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే ఈ మధ్యనే చిత్రీకరించిన ఈ సినిమా క్లైమేక్స్ సన్నివేశాలు చూసిన వారు ‘గోవిందుడు’ సినిమా కధ ఒకనాటి ‘సీతారామయ్యగారి మనవరాలు’ గా ఉంది అంటూ ప్రచారం చేస్తున్నట్లు టాక్. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా బయటకు వస్తున్న కధ ప్రకారం గోవింద్‌ విదేశాల్లో వుంటాడు. తండ్రిని ఎదిరించి గోవింద్‌ తండ్రి ప్రేమ వివాహం చేసుకుని విదేశాలకు వెళ్ళిపోతాడు. అక్కడ బాగా సెటిల్‌ అవుతాడు. తండ్రి కోరిక మేరకు గోవింద్‌ అంటే రామ్‌చరణ్‌ ఇండియా వస్తాడు. తన తాత దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఆప్యాయతలు అన్నీ రుచిచూస్తాడు. ఇంత ఆప్యాయతలు అనుబంధాలతో వున్న మనుషులను మోసం చేయడం తగదని అసలు నిజం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఆ నిజం రామ్ చరణ్ చెప్పకుండానే తాత ప్రకాష్ రాజ్ కు తెలిసి పోతుంది. గోవింద్ తల్లి తండ్రులు ఒక ప్రమాదంలో చనిపోతారు. తన తండ్రి కోరిక మేరకు తాత దగ్గరకు వచ్చిన రామ్ చరణ్ తన తల్లి తండ్రులు చనిపోయిన విషయం చెప్పలేక మధన పడిపోతూ ఉంటాడట. ఈమధ్యనే చిత్రీకరణ జరిగిన క్లైమేక్స్ సన్నివేశాలను చూసి కొంతమంది మీనా పాత్రను రామ్ చరణ్ పాత్రగా మార్చారు అని గాసిప్స్ మొదలు పెట్టారు. అసలు విషయం తెలియాలి అంటే దసరా వరకు ఆగాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: