ఇప్పటి దాకా టాలీవుడ్ హీరోలకు తమ సినిమాలకు సంభందించిన టైటిల్స్ అక్షరాలకు సంభందించిన సెంటిమెంట్ గురించి వార్తల హడావిడి విన్నాం. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ తన కొడుకుకు అభయ్ రామ్ అనే పేరు పెట్టడంతో టాలీవుడ్ టాప్ హీరోల పిల్లలకు ‘ఎ’ అక్షరం సెంటిమెంట్ పట్టుకుంది అనే వార్తలు కొంతమంది తెర పైకి తీసుకు వస్తున్నారు.  వారి వాదనకు బలంగా కొంతమంది టాప్ హీరోల పేర్లు కూడ చెపుతున్నారు. వెంకటేష్ తన కుమారుడుకు అర్జున్ అని పేరు పెడితే – పవన్ కళ్యాణ్ తన కొడుకుకు అకిరా నందన్ అనే పేరు పెట్టాడు. కొద్ది రోజుల క్రితం అల్లుఅర్జున్ తన కొడుకుకు ఆయాన్ అనే పేరు పెట్టి దాన్ని అర్ధాన్ని కూడ తన ట్విటర్ ద్వారా తెలియచేసాడు. ఇక లేటెస్ట్ గా జూనియర్ కూడ తన కొడుకుకు అభయ్ రామ్ అనే పేరు పెట్టడంతో టాలీవుడ్ టాప్ హీరోలందరికీ ఈ ‘ఎ’ అక్షరం పై మోజు పెరిగింది అనే వాదాన్ని విశ్లేషకులు తెర పైకి తీసుకు వస్తున్నారు. అనుకోకుండా యాదృచ్చికంగా జరిగిన విషయాలను సెంటిమెంట్ గా మార్చి జరుగుతున్న ప్రచారాన్ని చూస్తూ ఉంటే సెలెబ్రెటీల ఇళ్ళల్లో జరిగే ప్రతి విషయాన్ని మీడియా, విశ్లేషకులు ఎంత నిశితంగా పరిసీలిస్తున్నారో అర్ధం అవుతుంది.  ఇంతకీ జూనియర్ కు కూడ ఆ ‘ఎ’ సెంటిమెంట్ ఉందా అన్న విషయం అతడికే తెలియాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: