ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఫిల్మ్ కెరీర్ ని లీడ్ చేస్తున్న బ్యూటీ సమంత. సమంత తాజాగా నటించిన కోలీవుడ్ ఫిల్మ్ అంజాన్. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇందులో సమంత తీసుకున్న రెమ్యునరేషన్ దాదాపు కోటి రూపాయలు. అలాగే అంజాన్ మూవీ కోసం తనపై పెట్టిన అదనపు ఖర్చు మరో యాభై లక్షలు. ఇలా మొత్తంగా చూసుకుంటే అంజాన్ మూవీలో సమంత తీసుకున్నది కోటిన్నర రూపాయలుగా లెక్కతేలుతుంది. అయితే అంజాన్ మూవీ రిలీజ్ తరువాత సమంతకి ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అనేది కోలీవుడ్ ప్రొడ్యూజర్స్ టాక్. కోలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరు సూర్యని సమంత గురించి ఎంక్వైరీ చేసారట. సమంతకి అంత రెమ్యునరేషన్ ఇవ్వటం అవసరమా? తను తీయబోతున్న మూవీలో సమంతని తీసుకోవాలా? వద్దా? అంటూ సూర్యని ఓ సలహా ఇవ్వమన్నాడు. సూర్య ఒక్క క్షణం ఆలోచించకుండా అంత రెమ్యునరేషన్ అవసరం లేదు అని చెప్పుకొచ్చాడంట. ఈ విషయం బయటకు లీకై కోలీవుడ్ లో అందరికి తెలిసిపోయింది. మొదటగా సమంతని హీరోయిన్ గా సెలక్ట్ చేసుకున్న నిర్మాత, తరువాత సమంతకి నో చెప్సేశాడంట. దీంతో విషయం తెలుసుకున్న సమంత సూర్య పై పీకల్లోతు కోపంగా ఉంది. ఎలాగైన సమయం వచ్చినప్పుడు సూర్య లేక్క ఏంటో తేల్చుకోవాలని చూస్తుంది. తాజాగా అంజాన్ మూవీలోంచి ఇరవై నిముషాల లెన్త్ ని తగ్గించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: