సామాన్యంగా హీరోలను తమకు నచ్చిన హీరోయిన్ ఎవరూ అని ప్రశ్నించినప్పుడు తెలివిగా ఇక్కడి హీరోయిన్స్ పేర్లు చెప్పకుండా బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు చెప్పి తప్పించు కుంటూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా మహేష్ తన మనసులోని హీరోయిన్ పేరు బయటకు చెప్పేసాడు. ఈటివి లో ప్రసారం అయిన ‘మనసంతా మహేష్’ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ ఆ కర్యక్రమ యాంకర్ ఝాన్సీ అడిగిన ప్రశ్నకు సమాదానం ఇస్తూ తనకు చిన్నప్పటి నుండి అతిలోక సుందరి శ్రీదేవి అంటే విపరీతమైన ఇష్టమనీ ఇప్పటికి కూడ తాను శ్రీదేవికి వీరాభిమానినే అని అంటూ తన మనసులో మాట బయట పెట్టాడు ప్రిన్స్.  తాను ఇప్పటికీ శ్రీదేవితో నటించాలనే కోరిక ఉన్నా జనం ఒప్పుకోరుగా అంటూ జోక్ చేసాడు మహేష్. అదేవిధంగా తాను ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించినా తనకు వ్యక్తిగతంగా ‘ఒక్కడు’ సినిమా హిట్ ఇచ్చిన కిక్ మరే సినిమా ఇవ్వలేదని ‘పోకిరి’; ‘దూకుడు’ లాంటి సినిమాలు రికార్డులను క్రియేట్ చేసినా తనకు పూర్తిగా నచ్చిన సినిమా మాత్రం ‘ఒక్కడు’ అని అంటున్నాడు ఈ వెండి తెర రాజకుమారుడు. ఇదే ఇంటర్వ్యూలో మరొక ఆ శక్తికర విషయం చెపుతూ తనకు ఈత రాదనీ అయితే ఈత రాకుండా ‘వన్’ సినిమాలో క్లైమాక్స్ అంతా నీళ్ళల్లో బోట్ ఛేజింగ్ ల మధ్య దర్శకుడు సుకుమార్ తీస్తూ ఉంటె మనసులో భయం ఉన్నా ఎదో విధంగా ఆ సీన్స్ ను గట్టెక్కించానని తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు మహేష్. మహేష్ శ్రీదేవి ల కాంబినేషన్ తో ఏ ప్రముఖ దర్సకుడైనా ప్రయోగం చేస్తే మహేష్ కోరిక తీరుతుందేమో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: