ఎన్నో పాత్రలను క్రియేట్ చేసి ఎన్నో ఘనవిజయాలు అందుకున్న రాజమౌళిలో ఒక నటుడు ఉన్నాడు అన్న విషయం స్వయంగా రాజమౌళి తెలపడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. టాప్ హీరోలు అంతా రాజమౌళి సినిమాలలో నటించాలని ఎలా కోరుకుంటారో రాజమౌళి కూడ తన రూపాన్ని వెండి తెర పై చూసుకోవాలని చిన్నప్పుడు ఉబలాట పడే వాడట.  ఆ ఉత్సాహమే రాజమౌళిని చిన్న తనంలోనే బాల నటుడుగా మార్చింది. అయితే రాజమౌళి చిన్నతనంలో నటించిన ఆ సినిమా విడుదల కాకపోవడంతో నటుడిగా మారుదాము అనుకున్న రాజమౌళి ఆశ నెరవేరలేదు. రాజమౌళి తన చిన్ననాటి రోజులలో నిర్మిoచిన ఒక సినిమాలో బాలకృష్ణుడిగా నటించాడట. అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అప్పటి విషయాన్ని రాజమౌళి కృష్ణాష్టమి సందర్భంగా గుర్తుకు చేసుకుంటూ బాలకృష్ణుడిగా తాను కనిపిస్తున్న ఫోటోను పేస్ బుక్ లో పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. నిజంగా ఆ సినిమా అప్పట్లో విడుదలై విజయం సాధించి ఉంటే అలనాటి బాలనటుడు రాజమౌళి నేటి టాలీవుడ్ హీరోగా మారిపోయి ఉండేవాడెమో. అప్పుడు ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’ లు ఉండి ఉండవేమో. రాజమౌళికి చిన్ని కృష్ణుడి పై కోపం వచ్చినా చిన్ని కృష్ణుడుమాత్రం రాజమౌళి అభిమానులకు మేలు చేసాడు అని అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: