మాస్ సినిమాలకు చిరునామాగా ఉండే జూనియర్ ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరైన శ్రీకాంత్ అడ్డాల చెప్పిన ఒక లేటెస్ట్ స్టోరీ విన్నాడు అనే మాట సంచలనంగా మారింది. 'కొత్త బంగారు లోకం', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలతో తన స్థాయిని నిరూపించుకున్న శ్రీకాంత్ అడ్డాల నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ను 'ముకుంద'గా చూపించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల అయిన వెంటనే జూనియర్ తో ఒక సినిమా చేయడానికి ఒక మంచి ఫ్యామిలీ కధను రెడీ పెట్టాడని ఫిలింనగర్ టాక్. ఈ కధ విషయం పై ఇప్పటికే జూనియర్ శ్రీకాంత్ అడ్డాల మధ్య ప్రాధమిక చర్చలు కూడ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జూనియర్ నటిస్తున్న పూరీజగన్నాద్ సినిమా తరువాత శ్రీకాంత్ అడ్డాల సినిమా సెట్స్ పైకి వెళ్ళీ ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ నెలాఖరుకు వస్తుంది అనుకున్న ‘రభస’ సినిమాను ఆర్ధిక సమస్యలు చుట్టుముడుతున్నాయని ఫిలింనగర్ లో గాసిప్ ల హడావిడి ఎక్కువైంది. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం బెల్లంకొండ సురేష్ ‘రభస’ యూనిట్ కు ఇవ్వవలసిన్ పేమెంట్స్ ఇంకా పూర్తిగా సద్దుబాటు చేయలేదని ‘అల్లుడు శీను’ సినిమాకు వచ్చిన పది కోట్ల నష్ట ప్రభావం ‘రభస’ సినిమా పై పడింది అనే వార్తలు వస్తున్నాయి. దీనితో వినాయకచవితి రోజున విడుదల కావలసిన ‘రభస’ వెనక్కు వెళ్లి నాగచైతన్య ‘ఒకలైలా కోసం’ ముందుకు వచ్చింది అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: