‘అమీట్రోపిక్ లేటెరల్ సిరాసిస్’ అనే వ్యాధి నివారించే దిశగా అవగాహన పెంచడం కోసం ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులు అందరూ ఐస్ బకెట్ స్నానం చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షి స్తున్నారు. అంతేకాదు తమ ఐస్ బకెట్ స్నానం వీడియోను యూట్యూబ్ లో పెడుతూ ప్రజలకు ఇలా చేయగలరా అని సవాల్ విసురు తున్నారు. ఈమధ్యనే ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కుడా ఈసవాల్ విసిరారారు. సామాజిక కార్యకలాపాలలో ముందు వరసలో ఉండే కోలీవుడ్ బ్యూటీ హన్సిక ఈసవాల్ స్వీకరించడమే కాకుండా తను కుడా ఐస్ బకెట్ స్నానం చేసి ఆ దృశ్యాలను షూట్ చేసి యూట్యూబ్ లో పీట్టి తనలా దమ్ముoటే ఐస్ బకెట్ స్నానం చేయమని సవాల్ విసిరింది హన్సిక. అమెరికా లండన్ లో ఇప్పుడు హడావిడి చేస్తున్న ఈ ఐస్ బకెట్ స్నానాన్ని దక్షిణాది ప్రజలకు పరిచియం చేస్తూ హన్సిక విసిరిన ఛాలెంజ్ ఎంతమంది స్వీకరిస్తారో చూడాలి. ఈ వార్తలు ఇలా ఉండగా మన సెలెబ్రెటీలు విదేశీ కల్చర్ ను విపరీతంగా అనుసరిస్తూ విదేశాల్లో చాలామంది ఏపని చేస్తే ఇప్పుడు ఇండియాలో కుడా అదే చేయడంతో యువతరానికి తప్పుడు సంకే తాలు వెళ్ళు తున్నాయని అంటూ కొంత మంది హన్సిక ప్రయత్నాన్ని తప్పు పడుతున్నారు. విమర్శలు ఎలా ఉన్నా హన్సిక ఐస్ బకెట్ స్నానాన్ని మాత్రం చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: