ఒకప్పుడు రాజకీయాలలో తీరికలేకుండా సమయాన్ని గడిపిన చిరంజీవి, ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ సమయాన్ని సన్నిహితులతోనూ, సినిమా రంగంతోనూ గడుపుతున్నాడు. అయితే చిరంజీవి ఎప్పుడో చేయాల్సిన 150వ సినిమా ఇప్పటి వరకూ తెరకెక్కలేదు. ప్రస్తుతం ఆ మూవీకి సంబంధించిన షూటింగ్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఆలాగే చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన ప్రిప్రొడక్షన్ వర్క్ కూడ శరవేగంగా జరుగుతుంది. మొత్తానికి చిరంజీవి 150వ సినిమా చేయడానికి సిద్దమయ్యారు. చిరంజీవి తన పుట్టినరోజు అయిన ఆగష్టు 22న తన 150వ సినిమా గురించి అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. అయితే చిరంజీవి చేయబోతున్న ఆ 150వ సినిమా చాలా సీరియస్ సబ్జెట్ అయి ఉంటుందని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం చిరంజీవి చేయబోయే 150వ సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్. ఎటువంటి పొలిటికల్ లేదా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన సీరియస్ స్టోరీలు అలాగే ప్రయోగాత్మకత స్టోరీలు అన్ని బాక్సాపీస్ వద్ద రాణించలేకపోవడంతో, చిరంజీవి సైతం అటువంటి సబ్జెట్స్ జోలికి వెళ్ళటం లేదు. తన అభిమానులను ఎంటర్ టైన్ మాత్రమే చేయాలనుకుంటున్నాడు. అయిత ప్రస్తుతం కథల ఎంపిక జరుగుతుంది. రామ్ చరణ్ స్వయంగా తన తండ్రి చేయబోతున్న 150వ సినిమా కథను సెలక్ట్ చేసే పనిలో ఉన్నాడు. ఒకసారి కథ ఫైనలైజ్ అయ్యాక దర్శకుడిని ఎంచుకునే ఆలోచనలో ఉన్నారు. రామ్ చరణ్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: