టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించిన మూవీ మగధీర. రాజమౌళి దర్శకత్వంలో మెగా హీరో రామ్ చరణ్ నటించిన ఈ మూవీ టాలీవుడ్ బాక్సాపీస్ ని షేక్ చేసింది. అంతే కాకుండా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ రేంజ్ కి తీసుకుపోయిన మూవీలలో మగధీర మూవీ కూడ ఒకటిగా నిలిచింది. అయితే ఈ మూవీని హిందీలో రిమేక్ చేయటానికి పలువురు బిటౌన్ నిర్మాతలు ప్రతయ్నాలు చేశారు. అయితే చిరవకు మగధీర హిందీ రిమేక్ ని స్టార్ ప్రొడ్జూజర్ సాజిద్ నదియావాల చేజిక్కించుకున్నాడు. అలాగే ఈ మూవీలో నటించే బాలీవుడ్ యాక్టర్ ఎవ్వరు? అన్నది ప్రస్తుతం బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్ నటించనున్నాడనే కొన్ని వార్తలు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాహిద్ కపూర్ కూడా ‘మగధీర సినిమా చూసాను, నాకు చాలా బాగా నచ్చిందని’ అన్నాడు. బిటౌన్ టాక్ ప్రకారం సాజిద్ నదివాల రీసెంట్ గా షాహిద్ కపూర్ ని కలిసి మగధీర మూవీలో నటించాలని కోరాడట. అంతే కాకుండా ఈ మూవీలో హీరోయిన్ గా కత్రినాకైఫ్ ని తీసుకునే అవకాశం ఉందని కూడ అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ ఇప్పటి వరకూ రాలేదు. త్వరలోనే మగధీర హిందీ రిమేక్ లో ఎవ్వరు నటించనున్నారు అనేదానిపై నిర్మాత సాజిద్ నజియావాల అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నాడు. కత్రినాకైఫ్ మగధీర రిమేక్ లో హీరోయిన్ గా ఒప్పుకుంటే మూవీకి సంబంధించిన ప్రమోషన్ ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. అయితే మగధీర హిందీ రిమేక్ ని 2015 చివరిలో రిలీజ్ చేయాలని సాజిద్ నజియావాల సన్నిహితులతో చెప్పినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: