ప్రస్తుతం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన చిత్రం అంజాన్ మూవీ. అంజాన్ మూవీ రిలీజ్ నాటి నుండి నేటి వరకూ కలెక్షన్స్ నిలకడగానే ఉన్నాయి. అయితే ఈ మూవీ కలెక్షన్స్ కేవలం రెండు వారలు మాత్రమే నిలకడగా ఉంటాయని అని ట్రేడ్ అనలిస్ట్ లు అంటున్నారు. ఆ తరువాత మూవీపై వచ్చే కలెక్షన్స్ చాలా తక్కువని చెబుతున్నారు. అంజాన్ మూవీ రిలీజ్ అయిన తరువాత కొద్ది రోజులకే ఆ మూవీలో ఉన్న చెత్తని దాదాపు 20 నిముషాల వరకూ కత్తిరించారు. అంతే కాకుండా ఈ మూవీ పైరేటెడ్ కాకుండా కేవలం డిజిటల్ థియోటర్స్ లోనే రిలీజ్ చేయడంతో అంజాన్ మూవీ మొదటి వారం కలెక్షన్స్ ఎక్కువుగా వచ్చాయి. రెండో వారంలో అంజాన్ మూవీ కలెక్షన్స్ చూసుకుంటే చాలా వరకూ తగ్గుతూ వస్తున్నాయి. దాదాపు 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన అంజాన్ మూవీ, బడ్జెట్ కి మించి కలెక్షన్స్ రాబట్టాలంటే కొద్దిగా కష్టమే అంటున్నారు. ఈ మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్స్, అలాగే థియోటర్ యజమానులు సైతం ప్రస్తుతం తగ్గుతూ వస్తున్న అంజాన్ మూవీ కలెక్షన్స్ ని చూస్తుంటే నష్టాలు తప్పవనే తెలుస్తుంది. అయితే కోలీవుడ్ లో వస్తున్న అధికారిక లెక్కల ప్రకారం అంజాన్ మూవీ దాదాపు 8 కోట్ల రూపాయల నష్టాన్ని నిర్మాతకి మిగులుస్తుందని అంటున్నారు. అంతే కాకుండా రూరల్ ఏరియాల్లోని డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ మూవీ భారీగానే నష్టాల్ని మిగులుస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఈ మూవీలో సూర్య, సమంతల కెమిస్ట్రి మూవీ సక్సెస్ కి ఏ మాత్రం ఉపయోగపడలేదు. అంతే కాకుండా సమంత వల్ల మూవీకి మరింత బడ్జెట్ పెరిగిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: