బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్ ఎంత ప్రయత్నించినా తన మనసులోని మాటలను ఆపుకోలేక మీడియా ముందు అమీర్ ఖాన్ పై ఉండే తన అక్కసును వెళ్ళగక్కుకున్నాడు. బాలీవుడ్ సినిమా ఫంక్షన్స్ లో కలిసి నప్పుడు ఒకరి నొకరు కౌగిలించుకుంటూ కెమెరాలకు పోజులు ఇస్తారు అమీర్ – షారుఖ్ లు. అయితే ఇది ఇదంతా కనిపించే కోణంలో ఒక భాగం మాత్రమే . వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనేంత శత్రుత్వం ఉంది అనేది ఓపెన్ సీక్రెట్. ఈ మధ్యే విడుదలైన అమీర్ తాజా చిత్రం 'పీకే'కి సంబంధించిన న్యూడ్ పోస్టర్‌ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఏకంగా ఈ విషయాలు సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళాయి. ‘పీకే’ ఫస్ట్ లుక్ పై షారూక్ స్పందిస్తూ, 'నగ్నంగా నటించడం ఏమైనా గొప్ప విషయమా? దాన్ని టాలెంట్ అని ఎలా అంటాం?' అంటూ ఏకంగా అమీర్ పై సెటైర్లు వేయడం బాలీవుడ్ లో సంచలన వార్తగా మారింది.  షారూఖ్, తన తాజా సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ మాటలు అనడంతో మరింత ప్రాధాన్యతను యేర్పరుచుకుంది. గతంలో ఒకసారి ఆమీర్ తన బ్లాగులో, 'మా కుక్క పేరు షారుక్ ఖాన్' అంటూ పోస్ట్ చేయడంతో రేగిన దుమారం చల్లారినా దానికి ప్రతిస్పనదనగా షారుఖ్ ఈ కొత్త వివాదానికి తెరతీసాడు అనుకోవాలి.  కానీ లేటెస్ట్ గా వుదలైన ‘పీకే’ సినిమా స్టిల్స్ లో అమీర్ పెళ్ళి బ్యాండ్ వాయిoచే గెటప్ లో పూర్తిగా బట్టలు వేసుకుని కనిపించడం చూస్తూ ఉంటె అమీర్ పై  షారుఖ్ ఖాన్ విమర్సల ప్రభావం ఉంది అనే అనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: