శ్రుతిహాసన్ అందానికి యూత్ మాత్రమే కాదు జంతువులు కూడ ఆమె అందానికి ఆకర్షింపబడుతున్నాయి. వినడానికి జోక్ గా అనిపించినా ఇది ముంబాయిలో నిజంగా జరిగిన సంఘటన. శ్రుతి బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో కలిసి ‘తేవర్’ అన్న సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఒక్కడు’ సినిమాకు రీమెక్ గా ఈ సినిమాను బాలీవుడ్ లో తీస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ సాంగ్ లో శ్రుతి వేసుకున్న సెక్సీ కాస్ట్యూమ్స్ టాపిక్ ఆఫ్ బాలీవుడ్ గా మారాయి. ఈ పాట కోసం శ్రుతి ఆరబోసిన అందాల ఫోటో స్టిల్స్ ఇప్పటికే మీడియాలో హడావిడి చేస్తున్నాయి. అయితే ఈ ఐటమ్ సాంగ్ షూటింగ్ సందర్భంగా గత ఆదివారం ముంబాయిలోని ఈ సినిమా సెట్లో ఒక విచిత్ర సంఘటన జరిగిందని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ఈ ఐటమ్ సాంగ్ చిత్రీకరణ కోసం అనేక మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు కొన్ని గుర్రాలను కూడ ఈ పాట చిత్రీకరణలో వినియోగించారట. ఈ సినిమా సెట్లో టాప్ లేచిపోతున్న మ్యూజిక్ హంగామా మధ్య శ్రుతి రెచ్చిపోయి ఐటమ్ సాంగ్ చేస్తుంటే ఒక తెల్ల గుర్రం పాట షూటింగ్ జరుగుతున్న మధ్యలో శ్రుతి వైపు దూసుకుంటూ వచ్చి శ్రుతిని కరవాలని శ్రుతి పైకి దూకిందట. దీనితో అదిరిపోయిన శ్రుతి హీరో అర్జున్ కపూర్ వెనుకకు వెళితే అర్జున్ రియల్ హీరోలా మారి సెట్ నుండి ఆ గుర్రాన్ని తరిమేసాడట. అయితే ఈ సంఘటన చూసిన చాలామంది శ్రుతి ఐటమ్ సాంగ్ కు గుర్రం కూడ పిచ్చెక్కి పోయింది అని సెటైర్లు వేసుకున్నారట. దటీజ్ శ్రుతి బ్యూటీ.  

మరింత సమాచారం తెలుసుకోండి: